బంగారం కొనుగోలుపై గూగుల్ పే నుంచి కొత్త సర్వీసులు

టెక్ గెయింట్ దిగ్గజం గూగుల్ పే కొత్త సర్వీసులను లాంచ్ చేయబోతోంది. ఇక నుంచి బంగారం కొనాలనుకుంటే మీరు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు! ప్రముఖ డిజిటల్ పేమెంట్ 'గూగుల్ పే' ద్వారా కూడా మీరు బంగారం కొనుగో

|

టెక్ గెయింట్ దిగ్గజం గూగుల్ పే కొత్త సర్వీసులను లాంచ్ చేయబోతోంది. ఇక నుంచి బంగారం కొనాలనుకుంటే మీరు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు! ప్రముఖ డిజిటల్ పేమెంట్ 'గూగుల్ పే' ద్వారా కూడా మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఎక్కడైన డబ్బులు చెల్లించాలంటే ఇప్పుడు చాలామంది పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌లు వినియోగిస్తున్నారు.ఫోన్ పే, పేటీఎంల వలె గూగుల్ పే బంగారం కొనుగోళ్లకు సరికొత్త సర్వీసును త్వరలో లాంచ్ చేయబోతుంది. దీని ద్వారా 99.99% స్వచ్ఛత కలిగిన 24 కేరట్ల బంగారం కొనుగోలు చేయవచ్చు.

బంగారం కొనుగోలుపై గూగుల్ పే నుంచి కొత్త సర్వీసులు

గూగుల్ పే ద్వారా కూడా మనం బంగారం కొనుగోలు చేస్తే నేరుగా ఇంటికి వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ ఫాం ద్వారా మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

బంగారం: ఏం చేయాలి?

బంగారం: ఏం చేయాలి?

బంగారం కొనుగోలు, అమ్మకం కోసం గూగుల్ పే 'గోల్డ్ అకౌంట్'ను తీసుకు రానుంది. ఇందులోని గోల్డ్ అకౌంట్‌కు సబ్ స్క్రైబ్ కావాలి. ఇది గోల్డుతో లింక్ అయ్యే సేవింగ్స్ స్కీం. ప్రస్తుత మార్కెట్ ప్రకారం బంగాన్ని కొనుక్కోవడంతో పాటు దానిని వర్చువల్‌గా అట్టిపెట్టుకొని అవసరమైనప్పుడు గోల్డ్ కాయిన్లుగా లేదా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు.

ఎంఎంటీసీ సారథ్యంలో..

ఎంఎంటీసీ సారథ్యంలో..

పేటీఎం, ఫోన్ పేలు ఇలాంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ సర్వీసులు ఎంఎంటీసీ సారథ్యంలో నడుస్తాయి. ఈ సర్వీసులు లాంచ్ చేసేందుకు గోల్డ్ రిఫైనరీ ఎంఎంటీసీ - పీఏఎంపీతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గోల్డ్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూజర్లు కేవైసీ నిబంధనలు పూర్తి చేయాలి. మీ వ్యాలెట్ నుంచి మీరు మీ అన్ని లావాదేవీలను చూసుకోవచ్చు.

ఆ ధర 5 నిమిషాలు లాక్ చేయబడుతుంది

ఆ ధర 5 నిమిషాలు లాక్ చేయబడుతుంది

గూగుల్ పే సాయంతో మీరు ఎంఎంటీసీ - పీఏఎంపీ ఇండియా ప్రయివేట్ లిమిటెండ్ నుంచి డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవచ్చు. గూగుల్ పేలో ప్రస్తుత మార్కెట్ బంగారం కొనుగోలు ధరను, పన్నుతో కలిపి చూపిస్తుంది.

కొనుగోలు ప్రారంభించిన తర్వాత

కొనుగోలు ప్రారంభించిన తర్వాత

అక్కడ చూపించే ధర మీరు కొనుగోలు ప్రారంభించిన తర్వాత 5 నిమిషాల వరకు ఆ ధర లాక్ చేయబడుతుంది. ఎందుకంటే బంగారం ధరలు మారిపోతుంటాయి. ప్రాంతాలను బట్టి పన్నులు వివిధ రకాలుగా ఉండవచ్చు.

ఫోన్ నెంబర్ మార్చితే ఏం చేయాలి?

ఫోన్ నెంబర్ మార్చితే ఏం చేయాలి?

మీ వాలెట్ మీ సిమ్ కార్డుతో, పోన్ నెంబర్‌తో లింక్ చేయబడి ఉంటుంది. మీరు సిమ్ లేదా ఫోన్ నెంబర్ మార్చినప్పుడు మీ ఖాతాకు యాక్సెస్‌ను పునరుద్ధరించేందుకు మీ గుర్తింపును ధృవీకరించవలసి ఉంటుంది. సేవా నిబంధనలు లేదా వినియోగదారుల విధానాలు ఉల్లంఘిస్తే మీ ఖాతా యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు.

తాత్కాలికంగా లాక్

తాత్కాలికంగా లాక్

నిర్ణీత అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే గూగుల్ పే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని సైనౌట్ చేస్తుంది. సిమ్ లేదా ఫోన్ నెంబర్ మార్చి ఉంటే మీ గోల్డ్ వాలెట్ వాలెట్‌ను తాత్కాలికంగా లాక్ చేయడం ద్వారా బంగారాన్ని భద్రంగా ఉంచుంది.

మార్పును నిర్ధారించే స్క్రీన్

మార్పును నిర్ధారించే స్క్రీన్

గూగుల్ పే యాక్సెస్‌లో మార్పును నిర్ధారించే స్క్రీన్ కనిపిస్తుంది. అందులో 'కంటిన్యూ'ను ప్రెస్ చేయాలి. ఓపెన్ చేస్తే గూగుల్ ఫారం సర్వే వస్తుంది. దానిని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ యాక్సెస్‌ను నిర్ధారించుకొని మీ ఫోన్ నెంబర్‌ను అప్ డేట్ చేస్తుంది. ఈ అప్ డేట్ పూర్తయ్యేందుకు రెండ్రోజులు పట్టవచ్చు.

Best Mobiles in India

English summary
Google Pay set to launch Gold as investment plan: Here's what it means for you

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X