గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఫోన్‌పే, పేటీఎం మాదిరిగా..!
భారత్‌లో పెద్ద నోట్ల రద్దు సహా కరోనా సమయం నుంచి డిజిటల్ లావాలేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫలితంగా యాప్, ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించే చాలా సంస్థలకు ఈ పరిణామం మేలు చేసింది. అయితే ప్రారంభంలో చాలా సంస్థలు డిజిటల్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు వసూలు చేయలేదు. అనంతర కాలంలో ప్రతి లావాదేవీపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి.
అదనపు ఛార్జీలు : ఇప్పటికే ఫోన్‌పే, పేటియం వంటి సంస్థలు ఇప్పటికే ప్రతి లావాదేవీపై ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే తాజాగా గూగుల్ పే సంస్థ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే UPI ద్వారా ఫోన్ రీఛార్జ్ చేసేందుకు ఛార్జీలు వసూలు చేయనుంది. మొబైల్ రీఛార్జ్‌పై రూ.3 అదనంగా వసూలు చేయనుంది.

వెలువడని అధికారిక ప్రకటన : ఛార్జీలు విధింపుపై గూగుల్ పే సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గూగుల్ పే వినియోగదారుడు ఈ వివరాలను వెల్లడించారు. తన జియో ఫోన్ నంబర్‌కు రూ.749 రీఛార్జ్ చేయగా.. గూగుల్ పే అదనంగా రూ.3 వసూలు చేయడానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. యూపీఐ, బ్యాంక్ కార్డుల ద్వారా రీఛార్జ్ చేసినా రూ.3 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రీఛార్జీలపై అదనపు రుసుం లేదు : టిప్‌స్టర్ ముకుల్ శర్మ గూగుల్ పే ఛార్జీలపై తన ట్విట్టర్ ద్వారా మరిన్ని వివరాలు వెల్లడించారు. 100 రూపాయల్లోపు రీఛార్జీపై ఎటువంటి అదనపు ఛార్జీలు విధించలేదు. రూ.100 నుంచి రూ.300 మొబైల్ రీఛార్జ్‌లపై రూ.2 అదనపు ఛార్జీ, అదే రూ.300 పైన రీఛార్జీలపై రూ.3 అదనపు ఛార్జీలు వసూలు చేయనుందని తెలుస్తోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయి ? : అయితే నవంబర్ 10న భారతీయ వినియోగదారుల కోసం గూగుల్ పే కొన్ని నిబంధనలు అప్‌డేట్ చేసింది. అయితే ఈ అదనపు ఫీజు విధింపుపై రీఛార్జ్ చేస్తున్న సమయంలోనే వినియోగదారుడికి తెలియజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. సంస్థ తన ఇష్టానుసారం ఫీజులను నిర్ణయించవచ్చని కూడా నిబంధనలు చెబుతున్నాయి.
ఈ రెండు సంస్థలు ఇప్పటికే.. : అయితే నేరుగా ఆపరేటర్ పేజీ ద్వారా ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ చేయడం ద్వారా ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ప్లాట్‌ఫాం లను మానిటైజ్ చేయడంలో భాగంగా పేటీఎం, ఫోన్ పే ఇప్పటికే అదనపు రుసుం వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ పే కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పుడ్ ఆర్డర్, సినిమా టిక్కెట్లను బుకింగ్ చేయడంపై ఇప్పటికే ఛార్జీలు అమలు చేస్తాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








