Home
News

వావ్, 'గూగుల్ పే'లో వాయిస్ పేమెంట్స్.. మాట్లాడితే చాలు, పేమెంట్ జరిగిపోతుంది!

Google Pay voice payments: ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే సరికొత్త ఫీచర్‌ తీసుకురానుంది. దానితో మీరు మీ వాయిస్‌తోనే యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. AI టెక్నాలజీతో పనిచేసే ఈ వాయిస్ పేమెంట్స్ ఫీచర్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ మరింత వేగంగా, సులువుగా జరిగిపోతాయి. ముఖ్యంగా టైప్ చేయడం కష్టంగా ఉన్నవాళ్లకి ఇది ఉపయోగకరమైన ఫీచర్ అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ అప్‌డేట్ రాబోతుందని గూగుల్ తెలిపింది, కానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు.

గూగుల్ పే ఇండియా లీడ్ ప్రొడక్ట్ మేనేజర్ శరత్ బులుసు ప్రకారం, ఈ వాయిస్ పేమెంట్ సిస్టమ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ని చాలా సింపుల్ చేస్తుంది. యూజర్లు మాట్లాడితే చాలు, పేమెంట్ అయిపోతుంది. చేత్తో టైప్ చేసే పని ఉండదు. చదవడానికి, రాయడానికి ఇబ్బంది పడేవాళ్లకి ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుంది.

Google Pay Unveils AI Voice Payments for UPI  Making Digital Payments Easier in India

ఇండియన్ గవర్నమెంట్‌తో కలిసి గూగుల్ ఈ ఫీచర్‌ని డెవలప్ చేస్తోంది. భాషణి AI ప్రాజెక్ట్‌లో భాగంగా, ప్రాంతీయ భాషల్లో డిజిటల్ పేమెంట్స్‌ని అందుబాటులోకి తేవడానికి గూగుల్ ఈ ప్రయత్నం చేస్తోంది. ఈ AI టెక్నాలజీ ఇండియాలో యూపీఐ పేమెంట్స్ వాడే కోట్లాది మందికి గేమ్ ఛేంజర్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

* ఇకపై అందరూ వాడొచ్చు

వాయిస్ కమాండ్స్ ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం రావడంతో, గూగుల్ పే ఫైనాన్షియల్ సర్వీసులు అందరికీ అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు, చాలా మంది కొత్త యూజర్లు కూడా గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌కి అట్రాక్ట్ అవుతారని అంచనా. ఇదిలా ఉండగా, గూగుల్ సెక్యూరిటీని కూడా మరింత పటిష్టం చేస్తోంది.

* మోసాలకు కళ్లెం

ఇండియాలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని కట్టడి చేయడానికి గూగుల్ AI, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్‌ని వాడుతోంది. సైబర్ బెదిరింపులు రోజురోజుకీ ఎక్కువ అవుతున్న ఈ టైంలో, ఈ టెక్నాలజీస్ యూజర్లను స్కామ్స్ నుంచి, అక్రమ ట్రాన్సాక్షన్ల నుంచి కాపాడతాయి.

ఇండియా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో గూగుల్ పే ఆల్రెడీ టాప్ ప్లేయర్. 2024 నవంబర్ రిపోర్ట్ ప్రకారం, మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్స్‌లో గూగుల్ పే వాటా 37%. ఇక లీడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఫోన్‌పే మార్కెట్ షేర్ 47.8%. ఈ రెండు కంపెనీలు కలిపి ఇండియా యూపీఐ మార్కెట్లో 80% పైగా డామినేట్ చేస్తున్నాయి.

* డిజిటల్ పేమెంట్ యాప్స్‌లో ముందుంటుంది..

త్వరలో రాబోయే వాయిస్ పేమెంట్ ఫీచర్ తో గూగుల్ పే డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. టైపింగ్ కష్టంగా ఉన్నవాళ్లు, లేదా హ్యాండ్స్‌ ఫ్రీ పేమెంట్స్ చేయాలనుకునే చాలా మంది యూజర్లు గూగుల్ పే ఈజీగా ఉండటంతో దాని వైపు మారొచ్చు.

ఈ AI పవర్డ్ అప్‌డేట్ జస్ట్ కన్వీనియన్స్ మాత్రమే కాదు.. డిజిటల్ పేమెంట్స్‌ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ఒక ముందడుగు అని చెప్పొచ్చు. గూగుల్ పే లాగా, భవిష్యత్తులో ఇతర చెల్లింపు యాప్‌లు కూడా వాయిస్ ద్వారా చెల్లింపులు చేసుకునే సదుపాయాన్ని తీసుకురావచ్చు.

Best Mobiles in India

English summary
Google Pay introduces AI voice UPI payments for easier, faster transactions, especially for non-typists, enhancing accessibility and security in India's digital payment market, potentially boosting Google Pay's dominance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X