ఆపిల్ కి రూ.65,000 కోట్లు చెల్లించనున్న గూగుల్
గూగుల్ ఆపిల్ కి 65 వేల కోట్లు చెల్లించి ఈ సంవత్సరం ఆపిల్ మొబైల్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ గా ఉంచడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
గూగుల్ ఆపిల్ కి 65 వేల కోట్లు చెల్లించి ఈ సంవత్సరం ఆపిల్ మొబైల్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ గా ఉంచడానికి ఒప్పందం కుదుర్చుకుంది.2014లో 72 వందల కోట్లు చెల్లించిన గూగుల్ 2017 కొచ్చేసరికి 25 వేల కోట్లు చెల్లించింది . ఈ సంవత్సరం మాత్రం దానికి మూడు రెట్లు అంటే 65,000 కోట్లు చెల్లించి గూగుల్ సెర్చ్ ఇంజన్ని డీఫాల్ట్గా ఆపిల్ కి చెందిన సఫారీ బ్రౌజర్లో ఉంచనుంది.

తమ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వాడే వెబ్ బ్రౌజర్‌లో....
తమ ఆపరేటింగ్ సిస్టమ్‌పై వాడే వెబ్ బ్రౌజర్‌లో గూగుల్‌ను సెర్చ్ ఇంజిన్‌గా వినియోగించేందుకు 2013, 2014లో బిలియన్ డాలర్లు చెల్లించిన గూగుల్, ఆపై వినియోగదారులు పెరుగుతూ వచ్చిన కొద్దీ.. చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా పెంచింది. గతేడాది 3 బిలియన్ డాలర్లు చెల్లించింది.

4జీ టెక్నాలజీ వచ్చిన తరువాత....
4జీ టెక్నాలజీ వచ్చిన తరువాత, వెబ్ బ్రౌజింగ్ పెరగడం, కస్టమర్లు సంఖ్య ఎక్కువ కావడంతో ఈ ఏడాది 9 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. 2019లో ఈ మొత్తం 12 బిలియన్ డాలర్ల (రూ.87వేల కోట్లు) వరకూ పెరుగుతుందని, గోల్డ్‌మాన్ శాక్స్ అనలిస్ట్ రాడ్ హాల్ అంచనా వేస్తున్నారు.

గూగుల్‌కు వినియోగదారుల ట్రాఫిక్....
గూగుల్‌కు వినియోగదారుల ట్రాఫిక్ వచ్చే ముఖ్యమైన వాటిల్లో ఆపిల్ ప్రధానమైనదని గూగుల్ విశ్వసిస్తోంది. అందుకే ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి వెనకాడటం లేదు.

ఆపిల్ ఐఫోన్లు, ఐపాడ్స్ సహా ఐఓఎస్ పరికరాల్లో...
ఆపిల్ ఐఫోన్లు, ఐపాడ్స్ సహా ఐఓఎస్ పరికరాల్లో సఫారీలో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉపయోగిస్తోంది. ఇక వచ్చే యేడాది ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 2019లో సుమారు 12 బిలియన్ డాలర్లు చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








