స్కామ్ కాల్స్ నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గూగుల్ ఫోన్ యాప్ కొత్త ఫీచర్..!!
మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్లో స్పామ్ కాల్స్ సమస్య ఒకటిగా ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక్ అప్‌డేట్‌ను ( Google Phone App Will Detect Scam Calls ) విడుదల చేయనుంది. స్పౌమ్ కాల్స్ ను ఎదుర్కొనేందుకు వీలుగా గూగుల్ యాప్ లో మార్పులు చేస్తోంది. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు (గూగుల్ నానో AI) వినియోగించుకుంటోంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌ను గురించవచ్చు.
ఆండ్రాయిడ్ అథారిటీ రిపోర్టు ఆధారంగా గూగుల్ త్వరలో విడుదల కానున్న అప్‌డేట్ ద్వారా స్పామ్ డిటెక్షన్ సిస్టమ్ (స్పామ్ కాల్స్‌ను గుర్తించే వ్యవస్థ) ను కలిగి ఉండనుంది. అవసరం లేని కాల్స్ ను బ్లాక్ చేయడం లేదా ఈ తరహా కాల్స్ పట్ల అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వ్యక్తిగత భద్రత మెరుగవుతుందని భావిస్తోంది.

భవిష్యత్‌లో రానున్న గూగుల్ ఫోన్ యాప్ అప్‌డేట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని AI తో పనిచేస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్ లలో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. 138.0.654539475 గూగుల్ ఫోన్ యాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ ఉంది.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ జెమిని నానో AI రియల్ టైంలో స్కామ్ కాల్స్ పైనా అప్రమత్తం చేస్తుంది. ఈ చాట్‌బాట్‌ను ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ కోసమే అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల వ్యక్తిగత భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ జెమిని నానో AI సర్వీసులు ఆప్షనల్‌గా మాత్రమే ఉంటాయని, తప్పని సరిగా ఉపయోగించుకోవాలనే నిబంధన విధించే అవకాశం లేదు.
ప్రస్తుత రోజుల్లో స్పామ్ కాల్స్‌ను గుర్తించడం, బ్లాక్ చేయడం సులభంగా మారుతోంది. అయితే స్కామర్లు నిరంతరం తమను గుర్తించకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్కామ్ లేదా స్పామ్ కాల్స్ గుర్తించడంలో సరైన అవగాహన లేని వినియోగదారులకు.. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు రక్షణ కల్పిస్తాయి. ఫలితంగా నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉండదు.
* టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), టెలికాం మంత్రిత్వ శాఖ స్పామ్ కాల్స్ కోసం మార్గదర్శకాలను తయారుచేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. బ్యాంకులు, జీవిత బీమా, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి ప్రమోషనల్ కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఈ తరహా కాల్స్ ద్వారా ప్రయోజనం పొందుతున్న సంస్థలే వీటికి బాధ్యత వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కాల్స్‌ను గుర్తించేందుకు వీలుగా మూడు వేర్వేరు సర్వీస్ నంబర్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఏదైనా సంస్థ వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధించనున్నారని తెలుస్తోంది. వినియోగదారుల రక్షణ చట్టం 2019 లోని సెక్షన్లు 2(28) మరియు 2(47) ప్రకారం ఈ తరహా కాల్స్ తప్పుదారి పట్టించేవిగా పరిగణిస్తాయి. వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా వచ్చే కాల్స్‌ను ఇవి నియంత్రిస్తాయి.


Click it and Unblock the Notifications








