ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 2XL, రూ. 73000!

By Madhavi Lagishetty
|

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లే రాజ్యమేలుతున్నాయి. శాంసంగ్,ఆపిల్, లెనెవో, హెచ్టీసీ వంటి సంస్థలు పోటీపడుతుండా....వీటికి పోటీగా గూగుల్ కూడా స్మార్ట్ ఫోన్ల రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ ఎల్ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. తాజాగా మరో ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. పిక్సెల్ 2XL ఇప్పుడు ఒక నెల తర్వాత యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇండియాలో కొనుగోలు చేయడానికి రెడీగా ఉంది. ఈనెల ప్రారంభంలో దేశంలో పిక్సెల్ 2అమ్మకాలు జరిగాయి.

Google Pixel 2 XL now available for purchase through Flipkart starting at Rs. 73,000

గూగుల్ పిక్సెల్ 2XL, 64జిబి వేరియంట్ 73వేల రూపాయలకు,128జిబి మోడల్ 82వేల రూపాయలకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్ తర్వాత ఇండియాలో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ గా చెప్పవచ్చు. పిక్సెల్ 2XL బ్లాక్ మరియు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఆప్షన్స్ లో లాంచ్ చేశారు. అయితే ఫ్లిప్ కార్ట్ హ్యాండ్ సెట్లో బ్లాక్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.

పిక్సెల్ 2XL కొనుగోలుదారులకు కొన్ని లాంచింగ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. 64జిబి వెర్షన్ కోసం నెలకు 6,084రూపాయలు మరియు 128జిబి వెర్షన్ కోసం నెలకు 6,834రూపాయలు ఈఎంఐ రూపంలో చెల్లించే సదుపాయాన్ని కల్పించింది.

యూజర్లు ఓల్డ్ డివైసులను ఎక్స్ ఛేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఓల్డ్ డివైసులను మార్పిడి చేసుకోవడం ద్వారా 20,000 ఆఫ్ పొందవచ్చు. మీరు గూగుల్ పిక్సెల్ 2 లేదా పిక్సెల్ XL స్మార్ట్ ఫోన్లను ఎక్స్ ఛేంజ్ చేస్తే 7,100రూపాయలు అడిషనల్ ఆఫ్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పై ఆఫర్లే ఆఫర్లుఫ్లిప్‌కార్ట్ ఫోన్‌పై ఆఫర్లే ఆఫర్లు

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు EMI ట్రాన్సక్షన్స్ పై 8,000రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ Buzz క్రెడిట్ కార్డు హోల్డర్లు అదనంగా ఐదు శాతం తగ్గింపు పొందుతారు. ఇక గూగుల్ తన పిక్సెల్ 2XL మరియు పిక్సెల్ 2 స్మార్ట్ ఫోన్ల కోసం 2 సంవత్సరాలకు వారంటీని పొడగించింది. ఫ్లిప్ కార్ట్ తప్ప, పిక్సెల్ 2XL కూడా దేశవ్యాప్తంగా రిలయన్స్ డిజిటల్ మరియు ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలకు సిద్ధంగా ఉంది.

ఇక గూగుల్ పిక్సెల్ 2XL స్పెక్స్ చూసినట్లయితే...6అంగుళాల P-OLED స్క్రీన్ తో 18:9 యాస్పెక్స్ రేషియోతో 540పిపిఐ 1440×2880పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. అదనపు ప్రొటెక్షన్ కోసం డిస్ప్లే పైన 3డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది.

ప్రొసెసర్ కొరకు, గూగుల్ 2.35గిగా+1.0గిగా, 64బిట్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 ప్రొసెసర్ క్వాల్కమ్ ద్వారా ఉపయోగించింది. చిప్సెట్ అడ్రినో 540 జిపియూ మరియు 4జిబి LPDDR4 ర్యామ్ తో క్లబ్ చేసి ఉంటుంది. పిక్సెల్ 2XL ఇన్ బిల్ట్ స్టోరేజి స్పేస్ 64జిబి, 128జిబి వరకు ఉంటుంది.

ఇక కెమెరా గురించి చెప్పాలంటే...స్మార్ట్ ఫోన్లో 12.2మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాతో f/2.4ఎపర్చరుతో 8మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

3,520ఎంఏహెచ్ బ్యాటరీ డివైస్తో రన్ అవుతుంది. కనెక్టువిటీ ఆప్షన్స్ 4జి ఎల్టిఈ, వై-ఫై 802.11A/B/G/N/AC , బ్లూటూత్5.0, USB టైప్ –సి , జిపిఎస్, గ్లోనాస్ మరియు ఎన్ఎఫ్సి ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఫ్రంట్లో గూగుల్ పిక్సెల్ 2XL ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టంలో బాక్స్ నుంచే రన్ అవుతుంది.

Best Mobiles in India

English summary
The 64GB variant of the Google Pixel 2 XL is priced at Rs. 73,000 and the 128GB model is priced at Rs. 82,000.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X