గూగుల్ కొత్త ఫోన్లు వచ్చేశాయి బాసూ, స్పెషల్ ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

|

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన సరికొత్త ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐ/వో 2019 స‌ద‌స్సులో గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు గూగుల్ పిక్సల్ 3ఎలను మార్కెట్లోకి విడుదల చేసింది. గూగుల్ పిక్స‌ల్ 3ఎ ఫోన్‌లో 5.6 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 670 ప్రాసెసర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, క్విక్ చార్జ్‌, 12.2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల్లోకి ఓ సారి వెళితే..

గూగుల్ కొత్త ఫోన్లు వచ్చేశాయి బాసూ, స్పెషల్ ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి

 

ఇండియాలో గూగుల్ పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ ఎక్స్ఎల్ ధరలు

ఇండియాలో Google Pixel 3a ధర రూ.39,999గా నిర్ణయంచారు. Google Pixel 3a XL ధరను ఇండియాలో రూ.44,999గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు 4GB RAM/ 64GB storageతో మార్కెట్లోకి దూసుకువచ్చాయి. అయితే ఈ ఫోన్లు ఇండియాలో అఫిషియల్ గా ఇంకా లాంచ్ కాలేదు. ఈ నెల 15న ఇండియాలో లాంచ్ అవుతాయని కంపెనీ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ లో రిజిస్ట్రేషన్

ఫ్లిప్ కార్ట్ లో రిజిస్ట్రేషన్

ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ నెల 8 నుంచి ఈ ఫోన్లను ఫ్లిప్ కార్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.Clearly White, Just Black, and Purplish రంగుల్లో లభ్యం అవుతున్నాయి. అయితే ఇండియాకి రెండు కలర్స్ వేరియంట్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ కొనుగోలు ద్వారా యూజర్లు 3 నెలల పాటు YouTube Music Premium subscription ఉచితంగా పొందుతారు.

యుఎస్ లో ధర

యుఎస్ లో ధర

బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ఫోన్లు ఓ సంచలనం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పిక్సల్ హార్డ్ వేర్ Pixel Visual Coreని కూడా కంపెనీ రిమూవ్ చేసినట్లు తెలుస్తోంది. దాని స్థానంలో Titan M security chipని అమర్చింది. ఇంతకు ముందు ఫోన్లు సింగిల్ సిమ్ తో రాగా ఈ ఫోన్లు మాత్రం డ్యూయెల్ సిమ్ తో మార్కెట్లోకి వచ్చాయి. యుఎస్ లో వీటి ధర వరుసగా Pixel 3a 399 డాలర్లు Pixel 3a XL 479 డాలర్లుగా ఉంది. నేటి నుంచి ఈ ఫోన్లు Australia, Canada, France, Germany, Ireland, Italy, Japan, Singapore, Spain, Taiwan, and the UK వంటి దేశాల్లో అందుబాటులోకి వస్తాయి.

ఈ సిమ్ సపోర్ట్
 

ఈ సిమ్ సపోర్ట్

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఈ సిమ్ సపోర్ట్ తో వచ్చాయి. Airtel and Reliance Jioలు ఇప్పటికే ఈ సిమ్ లను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 9పై మీద ఆపరేట్ అవుతాయి.3 సంవత్సరాల పాటు ఓఎస్ అప్ డేట్ అందుకునే విధంగా వీటిని తీర్చిదిద్దారు.కంపెనీ నుంచి వచ్చిన AR Core framework అలాగే augmented reality applicationsను సపోర్ట్ చేసే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Google Pixel 3a, Pixel 3a XL camera features

Google Pixel 3a, Pixel 3a XL camera features

అడ్వాన్స్‌డ్ HDR+, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ కలయికతో పిక్సెల్ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.Google Pixel 3a and Pixel 3a XL ఫోన్లు 12.2 ఎంపి డ్యూయెల్ Pixel Sony IMX363 sensorతో దూసుకువచ్చాయి. ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ stabilisation (OIS + EIS), an f/1.8 aperture, 76-degree field of view, 1/2.55-inch sensor, and 1.4-micron pixels వంటి అత్యధ్బుత ఫీచర్లను కెమెరాలో జోడించింది. నైట్ మోడ్ లో కూడా అదిరిపోయే ఫోటోలను తీసుకోవచ్చు. 1080p వద్ద 120fps video recording సామర్ధ్యం ఉంది. 720p వద్ద 240fps, 30fps at 4K రికార్డింగ్ ను చేయవచ్చు. అలాగే ఫ్రంట్ సెల్పీ విషయానికి వస్తే 8 ఎంపీ సెన్సార్ 1.12-micron pixelsతో వచ్చింది. బ్యాక్ కెమెరాకు ఉన్న ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్

హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్

గూగుల్ పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో 6 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఓలెడ్ డిస్‌ప్లే ఉంది. 2160 x 1080 రెజల్యూషన్. డ్రాగన్ ట్రయల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటం విశేషం.గూగుల్ పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్‌తో రూపొందింది. 12.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.గూగుల్ పిక్సెల్ 3ఏ మోడల్ 5.6 అంగుళాల ఓలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2220 x 1080 పిక్సెల్స్, డ్రాగన్ ట్రయల్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో రావడం విశేషం.గూగుల్ పిక్సెల్ 3ఏ స్మార్ట్‌ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్‌ ఉన్నాయి. 12.2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఇతర అదనపు ఫీచర్లు

ఇతర అదనపు ఫీచర్లు

4G VoLTE, Wi-FI 802.11ac, Bluetooth v5.0, GPS/ A-GPS, NFC, a 3.5mm headphone jack on top వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. Pixel 3a బరువు 147 గ్రాములు కాగా Pixel 3a XL బరువు 167 గ్రాములు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pixel 3a, Pixel 3a XL With Snapdragon 670 SoC, Flagship Camera Launched: Price in India, Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X