మీ ఫేస్ డేటా ఇస్తే గూగుల్ 5 డాలర్లు ఇస్తుంది
టెక్ గెయింట్ గూగుల్ త్వరలో కంపెనీ నుంచి రానున్న ఫిక్సల్ 4 స్మార్ట్ ఫోన్ కోసం సరికొత్త టెక్నాలజీ మీద ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా యూజర్ల నుంచి ఫేస్ డేటాను కలెక్ట్ చేస్తోంది. next-gen facial recognition technologyని గూగుల్ పిక్సిల్ స్మార్ట్ ఫోన్లో ప్రవేశపెట్టాలనే టార్గెట్ తో గూగుల్ ఫేస్ డేటా మీద ప్రయోగాలు చేస్తోంది. రీసెర్చ్ కోసం యూజర్స్ నుంచి ఫేస్ డేటాను 5 డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూయార్క్ వీధుల్లోని ప్రజలను ఈ టెక్నాలజీ కోసం తమయొక్క ఫేస్ డేటాను అందివ్వాలని అడుగుతోంది. ఒకవేళ వారు ఇస్తే దానికి ప్రతిఫలంగా గూగుల్ కంపెనీ $5 (roughly Rs. 340)తగ చెల్లిస్తోంది. అక్కడి ఉద్యోగులను పర్మిషన్ అడుగుతూ ఫామ్ మీద సంతకాలను అడుగుతోంది. ఎవరైనా అనుమతిస్తే వారికి 5 డాలర్లు చెల్లించి వారి ఫేస్య స్కానింగ్ చేసుకుంటూ వెళుతోంది. ఈ కొత్త రకమైన పద్దతి ద్వారా డేటాను సేకరిస్తోందని ఇది ఇప్పటికే చాలా నగరాల్లో పూర్తయిందని సమాచారం.

ఈ ఆఫ్ బీట్ డేటా కోసం గూగుల్ ఎందుకు ఇలా చేస్తుందని అడిగితే దానికి గూగుల్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. face unlock feature మీద ప్రయోగాలు చేస్తున్నామని Pixel 4లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నామని దాని కోసమే ఇలా డేటాను సేకరిస్తున్నామని తెలిపింది. ZDNet reports ప్రకారం గూగుల్ న్యూయార్క్ వీధుల్లో ఉద్యోగుల నుంచి డేటా కలెక్ట్ చేస్తోందని , ప్రజల పర్మిషన్ తోనే ఇది చేస్తుందని తెలుస్తోంది.గూగుల్ ఉద్యోగులు అమెరికాలోని చాలా నగరాల్లో ఈ విధమైన క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. అక్కడి ప్రజల వద్దకెళ్లి వచ్చే తరం facial recognition phone unlocking మీద పనిచేస్తున్నామని దీని రీసెర్చ్ కోసం మాకు మీ ఫేస్ డేటా కావాలని వారు అడుగుతున్నారు. ఔత్సాహికులైన టెక్ యూజర్లు తమ ఫేస్ డేటాను వారికి అందిస్తున్నారు. దీని ప్రకారం రానున్న గూగుల్ ఫిక్సల్ స్మార్ట్ ఫోన్ సరికొత్త టెక్నాలజీతో ముందుకు రానుందని సమాచారం.
5 నిమిషాల పాటు స్కానింగ్
ఈ ఫేస్ డేటా కోసం గూగుల్ ఉద్యోగులు దాదాపు 5 నిమిషాల పాటు వ్యక్తి ఫేస్ ను స్కానింగ్ చేస్తున్నారు. ఫేస్ మొత్తం అన్ని వైపుల నుంచి కవర్ అయ్యే విధంగా ఈ స్కానింగ్ ఉంది. ఈ ఈవెంట్ ని అన్ని నగరాల్లో నిర్వహిస్తున్నామని గూగుల్ ఉద్యోగులు చెబుతున్నారు. అయితే దీనికి ఫేస్ డేటా ఇచ్చిన వారు కూడా పాజటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. గూగుల్ తమను సరికొత్తగా మార్చిందని గూగుల్ తోనే టెక్నాలజీ మీకు పరిచయం అయిందని, కాబట్టి గూగుల్ ఏం అడిగినా మేము సహాయ సహకారాలు అందిస్తామని అక్కడి వారు చెబుతున్నారు.

డైటా ప్రైవసీ అన్నది ఇప్పుడు సవాల్ గా మారిన నేపథ్యంలో గూగుల్ ఇలా ఫేస్ డేటా సేకరించడం ఆలోచనలకు తావిస్తోంది. అయితే గూగుల్ మాత్రం మేము చాలా సెక్యూరిటీతో ఈ డేటానే సేకరిస్తున్నామని. దీని వల్ల యూజర్లకు ఎటువంటి ప్రమాదం జరగదని చెబుతోంది. అయితే ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఇదివరకే గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్లకు ఇలా ఫేస్ డేటాను సేకరించారని మళ్లీ ఇలా చేస్తున్నారని దీని వల్ల యూజర్ల ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై గూగుల్ స్పందిస్తూ రానున్న జనరేషన్ కోసం సరికొత్త టెక్నాలజీ కోసం ప్రయోగాలు చేస్తున్నామని అందులో భాగంగానే ఈ ఫేస్ డేటా కలెక్ట్ చేస్తున్నామని దీనికి పూర్తి రక్షణ ఉందని తెలిపింది. ఏది ఏమైనా ఈ ఏడాది గూగుల్ ఫిక్సల్ ఫోన్లు సరికొత్త ఫేస్ రికాగ్నైజేషన్ టెక్నాలజీతో రానున్నట్లు తెలుస్తోంది. Apple's Face ID కన్నా ఇది చాలా బెటర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








