గూగుల్ పిక్సెల్ 5 & 5a 5G: ఈ రెండిటి మధ్య గల తేడాలు మరియు వాటి వివరాలు

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ సంస్థ 2020 సంవత్సరంలో గూగుల్ పిక్సెల్ 5 మరియు పిక్సెల్ 4A 5G స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో కొత్తగా పిక్సెల్ 5A 5G స్మార్ట్‌ఫోన్‌ను జోడించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నప్పటికీ దాదాపు ముందు తరం స్మార్ట్‌ఫోన్‌లకు సమానమైన ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉంది. గూగుల్ యొక్క ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పోలికలు ఏమేరకు భిన్నంగా ఉన్నాయో మరియు వాటి ఫీచర్‌ల మధ్య గల పోలికలు వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిజైన్ మరియు డిస్ప్లే

డిజైన్ మరియు డిస్ప్లే

ఈ మూడు పిక్సెల్స్ స్మార్ట్‌ఫోన్‌లు వెనుకవైపు ప్యానెల్ యొక్క ఎడమవైపు ఎగువ మూలలో స్క్వారిష్ కెమెరా మాడ్యూల్, పంచ్-హోల్ కటౌట్ మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫీచర్లను సమానంగా కలిగి ఉంటాయి. అయితే పిక్సెల్ 5 ఫోన్ మరింత కాంపాక్ట్ బిల్డ్ మరియు మెటల్ రియర్ ప్యానెల్‌తో నాణ్యమైన ఫినిషింగ్ ను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది మరియు IP68 రేట్ చేయబడింది.

గూగుల్ పిక్సెల్

మరోవైపు గూగుల్ పిక్సెల్ 4a 5G పాలికార్బోనేట్ బ్యాక్‌తో మ్యాట్ ఫినిష్‌తో వస్తుంది. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ ఉంటుంది కానీ IP రేటింగ్ లేదు. చివరగా పిక్సెల్ 5a 5G డిజైన్ ను విడదీయకుండా ఇంకా పెద్ద ఫారమ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉంటుంది మరియు మెటల్ యూనిబోడీ బిల్డ్ మరియు IP67 రేటింగ్‌తో వస్తుంది.

డిస్‌ప్లే విషయానికొస్తే పిక్సెల్ 5a 5G ఫోన్ 6.4-అంగుళాల OLED అతి పెద్ద డిస్‌ప్లేను FHD+ రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. ఇది పిక్సెల్ 4a 5G యొక్క 6.2-అంగుళాల OLED డిస్‌ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు పిక్సెల్ 5 యొక్క 6 అంగుళాల OLED డిస్‌ప్లే కంటే పెద్దది. అయితే పిక్సెల్ 5 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR సపోర్ట్‌తో వస్తుంది.

 

హార్డ్‌వేర్ మరియు బ్యాటరీ

హార్డ్‌వేర్ మరియు బ్యాటరీ

ఈ పిక్సెల్ మోడళ్లన్నీ కూడా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765G 5G కి సపోర్ట్ అందిస్తున్నాయి. కానీ పిక్సెల్ 5 మిగతా వాటి కంటే అధిక ర్యామ్‌ను కలిగి ఉంటుంది. బ్యాటరీ పరంగా చూసుకున్న కూడా పిక్సెల్ 5a 5G ఇతర రెండు స్మార్ట్‌ఫోన్‌ల కంటే పెద్ద 4620mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి శక్తిని పొందుతుంది. అలాగే పిక్సెల్ 5 వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

కెమెరా

కెమెరా

ఇమేజింగ్ కోసం ఈ మోడళ్లన్నీ వెనుకవైపు 12.2MP ప్రైమరీ సెన్సార్ మరియు 16MP సెకండరీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌తో సమానంగా ఉంటాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా సెన్సార్ ను కలిగి ఉన్నాయి. అయితే పిక్సెల్ 6 లో పెద్ద అప్‌గ్రేడ్‌లు వస్తాయని ఆశించవచ్చు.

తీర్పు

తీర్పు

ఈ మూడు పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య చాలా తక్కువ తేడాలు ఉన్నందున అవి దాదాపు ఒకే పనితీరును, డిజైన్ ను మరియు అనుభూతిని అందిస్తాయని ఆశించవచ్చు. పిక్సెల్ 6 మాత్రమే కొన్ని గణనీయమైన మార్పులను తెస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గత సంవత్సరం పిక్సెల్ 5 అధిక రిఫ్రెష్ రేట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలు మరియు మరింత ప్రీమియం బిల్డ్ కలిగి ఉంది. అయితే పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సాపేక్షంగా తక్కువ ధరకే వస్తాయి కనుక ఇది తెలివైనది.

Best Mobiles in India

English summary
Google Pixel 5a 5G vs Pixel 5 5G: What are The Differences Between Both?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X