Google Pixel 6a, Buds Pro మొదటిసేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో జరగనున్నాయి!! ఆఫర్‌లు ఇవిగో...

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ మే నెలలో నిర్వహించిన గూగుల్ యొక్క I/O ఈవెంట్ లో పిక్సెల్ వాచ్‌తో పాటు గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్‌ఫోన్ మరియు ఇయర్‌బడ్‌లను విడుదల చేసింది. అయితే గూగుల్ పిక్సెల్ 6ఎ మరియు పిక్సెల్ బడ్స్ ప్రో ట్రూ వైర్‌లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్‌బడ్‌ల యొక్క మొదటి అమ్మకాలు నేడు భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ లో నిర్వహించనున్నాయి.ఈ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ గూగుల్ యొక్క అంతర్గత టెన్సర్ SoC ద్వారా రన్ అవుతూ 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మద్దతుతో జత చేయబడి ఉంటుంది. కస్టమర్‌లు ఈ హ్యాండ్‌సెట్‌ను మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌తో వస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ పిక్సెల్ 6a ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ 6a ధరల వివరాలు

భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లో లభించే ఈ మోడల్ యొక్క ధర రూ.43,999. ఇది చాక్, చార్ కోల్ మరియు సాగే వంటి మూడు కలర్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Asus ROG కొత్త ల్యాప్‌టాప్‌లు AMD రైజెన్ ప్రాసెసర్‌లతో లాంచ్ అయ్యాయి!!Asus ROG కొత్త ల్యాప్‌టాప్‌లు AMD రైజెన్ ప్రాసెసర్‌లతో లాంచ్ అయ్యాయి!!

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ ఇండియాలో రూ.19,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌లు చార్‌కోల్, కోరల్, ఫాగ్ మరియు లెమన్‌గ్రాస్ అనే నాలుగు విభిన్న కలర్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

Oppoనుంచి మ‌రో అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌.. భార‌త్‌లో ఎప్పుడంటే!Oppoనుంచి మ‌రో అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌.. భార‌త్‌లో ఎప్పుడంటే!

గూగుల్ పిక్సెల్ 6a ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్ ఆఫర్స్

గూగుల్ పిక్సెల్ 6a ఫ్లిప్‌కార్ట్‌ సేల్స్ ఆఫర్స్

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క ఫ్లిప్‌కార్ట్‌ మొదటి సేల్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలుచేసే వారు రూ.2,250 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్ కోటక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు కూడా రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అలాగే ఎక్సచేంజ్ లో భాగంగా గరిష్టంగా రూ.19,000 వరకు ఎక్సచేంజ్ ని పొందవచ్చు. Google Nest Hub Gen 2, Pixel Buds A సిరీస్ లేదా Fitbit Inspire 2ని పిక్సెల్ 6Aతో రూ. 4,999కి అందిస్తోంది. మీరు మూడు నెలల పాటు ఉచిత YouTube Premium మరియు Google One సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లోనే ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?స్మార్ట్‌ఫోన్‌లోనే ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతూ 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్-HD+(1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoC మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 6GB LPDDR5 RAMతో జత చేయబడి ఉంటుంది.

ఆప్టిక్స్

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే కెమెరా యూనిట్‌లో 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్ 128GB అంతర్నిర్మిత స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే యాక్సిస్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 4,410mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Virat Kohli వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలిస్తే షాక్ అవుతారు!Virat Kohli వాడే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో తెలిస్తే షాక్ అవుతారు!

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో ఇయర్‌బడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ TWS ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా వినియోగదారులు పరిసర ధ్వనిని వినడానికి అనుమతించే ప్రత్యేక పారదర్శకత మోడ్‌ను అందిస్తాయి. అవి కెపాసిటివ్ టచ్ సెన్సార్‌లను కలిగి ఉంటాయి మరియు ఒకే సమయంలో బహుళ పరికరాలతో జత చేయడానికి అనుమతించే మల్టీపాయింట్ కనెక్టివిటీకి మద్దతును కలిగి ఉంటాయి. Google Pixel Buds Proలో బ్లూటూత్ v5.0 కనెక్టివిటీ ఉంది మరియు వాటిని ఏదైనా బ్లూటూత్ v4.0+ పరికరంతో జత చేయవచ్చు. ఇయర్‌బడ్‌లు IPX4 స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉన్నాయి మరియు కేస్ IPX2 స్ప్లాష్-రెసిస్టెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఛార్జింగ్ కేస్ వైర్డు ఛార్జింగ్ మరియు Qi వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం USB టైప్-సికి మద్దతు ఇస్తుంది. ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో ఒక గంట వరకు వినే సమయాన్ని అందించడానికి ఛార్జింగ్ కేస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Best Mobiles in India

English summary
Google Pixel 6a, Pixel Buds Pro Earbuds First Sales Start Today in India Via Flipkart: Price, Specs, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X