ఈ ఫోన్ పై రూ.16,000 ధర తగ్గింది! ప్రస్తుతం, కొత్త ధర వివరాలు
గూగుల్ యొక్క కొత్త పిక్సెల్ ఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు సంతోషం కలిగిస్తూ, గూగుల్ పిక్సెల్ 7a ఇండియాలో లాంచ్ అయింది. మరియు ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సేల్ కి అందుబాటులో ఉంది. అయితే, ఈ Pixel 7a ఫోన్ లాంచ్ తర్వాత గూగుల్ Pixel 6a ధర భారీగా తగ్గింది.
అవును నిజమే ఇది చాలా వరకూ ఊహించిన విషయమే అయినా కూడా మరీ ఇంత భారీగా ధర తగ్గుతుందని అంచనా వేయలేదు. ఇక విషయానికి వస్తే, గూగుల్ Pixel 7a ఫోన్ లాంచ్ తర్వాత ఎంత ధరకి అందుబాటులో ఉంది, ధర ఎంత తగ్గింది అనే విషయాలు తెలుసుకుందాం.

గూగుల్ Pixel 6a యొక్క ధర ఎంత తగ్గింది,
గూగుల్ Pixel 6a ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ధర రూ. 27,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.43,999. అంటే ఈ ఫోన్ పై ప్రస్తుతం నేరుగా రూ. 16,000 ధర తగ్గింది.దీనిని మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ Pixel 6a, 6GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ చేయబడింది. మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, పిక్సెల్ 6a 2022 మూడవ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ యూనిట్లకు పైగా సేల్ చేయబడింది కూడా, ఇది మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది.
గూగుల్ పిక్సెల్ 6a: మీరు కొనుగోలు చేయాలా?
ఈ తగ్గిన ఆఫర్ ధర వద్ద, మీరు గూగుల్ Pixel 6a ని ధర రూ. 27,999 కి కొనుగోలు చేయడం సరియైనదేనా? అని ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ Pixel 6a స్మార్ట్ ఫోన్ అద్భుతమైన కెమెరా పనితీరును అందిస్తుంది మరియు ఇది గత సంవత్సరం లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌లలో ఒకటిగా ఉంటుంది. ఈ విషయాలు గమనిస్తే, ఈ డీల్ చాలా ఉత్తమం అని చెప్పవచ్చు.
ఇక గూగుల్ పిక్సెల్ 6a స్పెసిఫికేషన్ల వివరాలు
Pixel 6a అనేది గూగుల్ యొక్క అంతర్గత చిప్, Google Tensor ద్వారా పనిచేస్తుంది, ఇది సున్నితమైన పనితీరును అందిస్తుంది మరియు కస్టమర్‌ల మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల డిస్‌ప్లే, 18W వైర్డ్ ఛార్జింగ్‌తో 4410 mAh బ్యాటరీ మరియు డిస్‌ప్లే కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి. లాంచ్ చేసిన సమయంలో, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12లో పనిచేస్తుంది.ఇంకా ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ 13కి అప్‌గ్రేడ్ చేయబడింది.
ఈ ఫోన్ మూడు రంగులలో అందుబాటులో ఉంది: చాక్, చార్ కోల్ మరియు సేజ్ రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో గత సంవత్సరం జూలై 21న ప్రీ-ఆర్డర్‌లు మొదలయ్యాయి మరియు జూలై 28 నుండి ఈ ఫోన్ డెలివరీ లు మొదలయ్యాయి.
గూగుల్ పిక్సెల్ 6a కెమెరా వివరాలు గమనిస్తే, ఈ ఫోన్‌లో 12.2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.ఇది గూగుల్ పిక్సెల్ 6a మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడానికి సహాయపడతాయి.


Click it and Unblock the Notifications








