Google I/O కాన్ఫరెన్స్‌లో Pixel 6a ఫోన్ అధునాతన ఫీచర్లతో లాంచ్ అయింది!!

|

ప్రముఖ సెర్చ్ దిగ్గజం గూగుల్ 2022 ఈ సంవత్సరంలో కంపెనీ యొక్క వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌ Google I/O ని బుధవారం ప్రారంభించింది. ఈ కాన్ఫరెన్స్‌లో కంపెనీ కొత్తగా గూగుల్ పిక్సల్ 6a స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఇది ఇంటర్నల్ టెన్సర్ ప్రాసెసర్ మరియు 6GB RAMతో జత చేయబడిన టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 6.1-అంగుళాల డిస్‌ప్లే, 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 24 గంటల బ్యాటరీ లైఫ్‌ని అందజేయడమే కాకుండా ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్‌తో గరిష్టంగా 72 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. గూగుల్ బ్రాండ్ యొక్క ముందుతరం ఫోన్లు పిక్సల్ 6 మరియు పిక్సల్ 6 ప్రో తో పోలిస్తే ఇది తక్కువ ధరలోనే లాంచ్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Google I/O

Google I/O వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌లో గూగుల్ సంస్థ తన నుంచి రాబోయే పిక్సెల్ 7 మరియు పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల డిజైన్‌ను కూడా టీజ్ చేసింది. వీటిని ఈ సంవత్సరం చివరిలో విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది. పిక్సెల్ 7 సిరీస్ లో తర్వాతి తరం టెన్సర్ SoC, అల్యూమినియం కెమెరా మాడ్యూల్ మరియు ఆండ్రాయిడ్ 13 ని వినియోగించే పనిలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో పాటుగా గూగుల్ ప్రాసెసర్ ద్వారా రన్ అయ్యే పిక్సెల్ బ్రాండ్ టాబ్లెట్ కూడా 2023లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
 

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ $449 ధర వద్ద లాంచ్ అయింది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ. 34,800. ఈ స్మార్ట్‌ఫోన్ చాక్, చార్‌కోల్ మరియు సేజ్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. జూలై 21 నుండి USలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి తీసుకొనిరానున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంతో సహా ఇతర మార్కెట్‌లలో గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ యొక్క ధర మరియు లభ్యతను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యొక్క చాటింగ్ సంభాషణలను దాచడం ఎలా?ఇన్‌స్టాగ్రామ్‌లో మీ యొక్క చాటింగ్ సంభాషణలను దాచడం ఎలా?

గూగుల్ పిక్సెల్ 6a స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ 6a స్పెసిఫికేషన్స్

గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతూ 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.1-అంగుళాల ఫుల్-HD+ OLED డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో పాటుగా 1,080 x 2,400 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఇది ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoC మరియు 6GB LPDDR5 RAMతో జత చేయబడిన టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఆప్టిక్స్

గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.7 ఎపర్చరు లెన్స్‌తో 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు f /2.2 ఎపర్చరు లెన్స్ తో 12-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందుభాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. అయితే ముందు కెమెరా 30fps వద్ద 1080p వరకు వీడియో రికార్డింగ్ మద్దతును అందిస్తుంది.

ఇంటర్నల్ స్టోరేజ్

గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తూ కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2 మరియు USB టైప్-C పోర్ట్ వంటి వాటిని కలిగి ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో బయోమెట్రిక్ యాక్సిస్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, బేరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. చివరిగా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,410mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
Google Pixel 6a Smartphone Launched on Google I/O Event With Dual Cameras: Price, Specifications, India Launch Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X