Home
News

Flipkartలో రూ.9,800 భారీ తగ్గింపుతో Google Pixel 6a స్మార్ట్ ఫోన్!

దేశంలో దీపావ‌ళి పండ‌గ సీజ‌న్ నేప‌థ్యంలో Flipkart లో నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక సేల్‌లో భాగంగా అనేక గాడ్జెట్ల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్‌లో కొద్ది నెల‌ల క్రితం లాంచ్ అయిన Google Pixel 6a మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫ‌ర్‌ అందుబాటులో ఉంది. ఈ Google Pixel 6a మొబైల్‌ రూ.43,999 ప్రారంభ ధరతో భార‌త్‌లో లాంచ్ అయింది.

Pixel

కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా రూ.9,800 తగ్గింపుతో అందుబాటులో ఉంది. Google Pixel మొబైల్‌కు మారాల‌ని భావించే వారికి, అంతేకాకుండా బెస్ట్ కెమెరా క్వాలిటీ కలిగిన మొబైల్ కు మారాలని భావించే వారికి ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్పొచ్చు.

రూ.9,800 తగ్గింపుతో జాబితా చేయ‌బ‌డింది:

రూ.9,800 తగ్గింపుతో జాబితా చేయ‌బ‌డింది:

Flipkart Big Diwali Saleలో, Google Pixel 6a యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ.43,999, కానీ ఇది ప్ర‌స్తుతం ధర తగ్గింపు కింద రూ.34,199కి జాబితా చేయబడింది. ఇది కాకుండా, ఫోన్‌పై ఇతర ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాట‌న్నిటినీ యాడ్ చేయ‌డం ద్వారా మొబైల్ ధ‌ర‌ను ఇంకా త‌గ్గించ‌వ‌చ్చు.

Google Pixel 6aని రూ.17,299 లకు ఎలా పొందాలి?

Google Pixel 6aని రూ.17,299 లకు ఎలా పొందాలి?

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్ కొనుగోలుపై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. మీరు ఈ మొబైల్ కొనుగోలు కోసం SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు 10% లేదా రూ.1,250 తగ్గింపు పొందుతారు. SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే EMI లావాదేవీలపై మీకు రూ.2,00 వరకు తగ్గింపును పొందవచ్చు. రూ.29,999 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై పైన పేర్కొన్న ఏదైనా చెల్లింపు ఎంపికలను ఉపయోగిస్తే రూ.750 తగ్గింపు పొందవచ్చు.

పైన పేర్కొన్న ఆఫర్‌లతో పాటు, ఇ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్ఛేంజ్ తగ్గింపును అందిస్తోంది. మీరు Pixel 6a కొనుగోలు కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.16,900 తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ చేంజ్ విషయంలో తగ్గింపు అనేది పాత ఫోన్ యొక్క మోడల్ మరియు స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లన్నీ అర్హత సాధిస్తే... మీకు గూగుల్ Pixel 6a మొబైల్ రూ.17,299 కి అందుబాటులో ఉంటుంది.

Google Pixel 6a ఫీచ‌ర్లు తెలుసుకుందాం:

Google Pixel 6a ఫీచ‌ర్లు తెలుసుకుందాం:

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతూ 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్-HD+(1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoC మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 6GB LPDDR5 RAMతో జత చేయబడి ఉంటుంది.

బెస్ట్ కెమెరా ఆప్షన్స్:

బెస్ట్ కెమెరా ఆప్షన్స్:

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే కెమెరా యూనిట్‌లో 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది. చిత్రాన్ని తీసిన తర్వాత, ఫ్రేమ్ నుండి ఏదైనా అదనపు అంశాలు లేదా వస్తువులను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. రూ.30,000లోపు ల‌భించే కొన్ని ప్రసిద్ధ మధ్య-శ్రేణి ఫోన్‌ల కంటే ఇది తక్కువ-కాంతి చిత్రాలను బాగా క్యాప్చర్ చేయగలదు. ఈ మొబైల్ 128GB అంతర్నిర్మిత స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే యాక్సిస్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 4,410mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇలా ఈ మొబైల్ అనేక గొప్ప ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. కాబ‌ట్టి, ఈ మొబైల్‌ను రాబోయే సేల్‌లో ల‌భించే అతి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌రం అనే చెప్పొచ్చు.

Best Mobiles in India

English summary
Google Pixel 6a smartphone with huge discount of Rs.9,800 on Flipkart!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X