Google Pixel 7 లాంచ్ తేదీ ఖ‌రారైంది.. పూర్తి వివ‌రాల కోసం చూడండి!

|

ప్ర‌ముఖ సెర్చింజ‌న్ దిగ్గ‌జం Google కంపెనీ, త‌మ త‌దుప‌రి త‌రం Pixel మొబైల్స్‌కు సంబంధించి కీల‌క విషయాన్ని వెల్ల‌డించింది. Google Pixel 7 మరియు Pixel 7 Pro స్మార్ట్‌ఫోన్ల‌ను అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించి లాంచ్ తేదీని ఖరారు చేసింది. ఈ రెండు Pixel స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్ల‌ను అక్టోబర్ 6 వ తేదీన లాంచ్ చేసేందుకు నిర్ణయించినట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేర‌కు సంస్థ త‌మ యూఎస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న‌ట్లు మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 
Google Pixel 7 లాంచ్ తేదీ ఖ‌రారైంది.. పూర్తి వివ‌రాల కోసం చూడండి!

ఈ రాబోయే కొత్త మోడ‌ల్స్‌కు సంబంధించి కంపెనీ ముందుగా ఈ సంవత్సరం ప్రారంభంలో Google I/Oలో హింట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, Google Pixel Watch విష‌యానికొస్తే.. కంపెనీ మే నెల‌లో టీజ్ చేసింది. Google నుంచి అందిన స‌మాచారం ప్రకారం, Pixel 7 మరియు Pixel 7 Pro, అలాగే Pixel Watch అన్నీ అక్టోబర్ 6వ తేదీన ఆవిష్కరించనున్న‌ట్లు సమాచారం. అదేవిధంగా, కొత్త Nest స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌లు కూడా కంపెనీ నుంచి లాంచ్ కానున్నాయి.

లాంచ్ ఈవెంట్ విశేషాలు!
కంపెనీ తన తదుపరి "మేడ్ బై Google" లాంచ్ ఈవెంట్ ను అక్టోబర్ 6 వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంగళవారం తన US వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అక్టోబర్ 6, 2022న ఉదయం 10 గంటలకు ET జరిగే లైవ్ ఈవెంట్‌లో తదుపరి Google Pixel డివైజ్‌ల పోర్ట్‌ఫోలియోను అధికారికంగా ప్రారంభిస్తామని ల్యాండింగ్ పేజీ ప్రకటించింది. Google Pixel 7 మరియు Pixel 7 Pro కంపెనీ యొక్క రెండవ తరం టెన్సర్ SoC ప్రాసెస‌ర్‌ల‌తో రానున్నాయ‌ని స‌మాచారం.

Google Pixel 7 లాంచ్ తేదీ ఖ‌రారైంది.. పూర్తి వివ‌రాల కోసం చూడండి!

అంతేకాకుండా, ఇవి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఓఎస్‌తో ర‌న్ చేయబడతాయని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. మే నెలలో Google I/Oలో కంపెనీ వీటిని మొదటిసారిగా ఆవిష్కరించింది. Google ప్రకారం, ఈ మొబైల్స్‌లో వినియోగిస్తున్న‌ కొత్త చిప్‌సెట్ యూజ‌ర్ల‌కు భద్రతకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పేర్కొంది. అంతేకాకుండా ఈ మోడ‌ల్‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.

మే నెల‌లో సూచించిన విధంగా Google Pixel Watch కూడా రాబోయే ఈవెంట్లో ఆవిష్కరించబడుతుంది. Google ప్రకారం, ఇది కంపెనీ రూపొందించిన మొదటి స్మార్ట్‌వాచ్, దాని సాఫ్ట్‌వేర్‌ వ్యాయామం మరియు ఆరోగ్యంపై కేంద్రీకృతం అయ్యేలా Fitbit టెక్నాల‌జీతో త‌యారు చేశారు. రాబోయే ఈ స్మార్ట్‌వాచ్ కొత్త WearOS ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ అన్ని పిక్సెల్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు క‌నెక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Google Pixel 7 లాంచ్ తేదీ ఖ‌రారైంది.. పూర్తి వివ‌రాల కోసం చూడండి!

Google నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన Pixel 6a స్మార్ట్‌ఫోన్ గురించి కూడా తెలుసుకుందాం:

Google Pixel 6a స్పెసిఫికేషన్స్:
గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతూ 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్-HD+(1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoC మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 6GB LPDDR5 RAMతో జత చేయబడి ఉంటుంది.

 

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే కెమెరా యూనిట్‌లో 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్ 128GB అంతర్నిర్మిత స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే యాక్సిస్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 4,410mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ప్ర‌స్తుతం ఈ Google Pixel 6a మోడ‌ల్ 6జీబీ ర్యామ్ వేరియంట్ 38శాతం డిస్కౌంట్‌తో రూ.34,370 కి అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Google Pixel 7 Series and Pixel Watch Launch Date Announced

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X