Home
News

గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్! ధర, లాంచ్ తేదీ వివరాలు 

By Maheswara

గూగుల్ పిక్సెల్ 7a త్వరలో లాంచ్ కాబోతున్న నేపథ్యంలో,ఈ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు ఆన్లైన్ లో లీక్ అయినట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ గూగుల్ పిక్సెల్ 7a గత సంవత్సరం మే 2022లో లాంచ్ చేసిన గూగుల్ పిక్సెల్ 6a ఫోన్ కు కొనసాగింపు గా వస్తుంది.

ఈ ఫోన్, రాబోయే నెల మే 10న జరగబోయే Google I/O ఈవెంట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. రాబోయే గూగుల్ స్మార్ట్‌ఫోన్ దాని ముందు మోడళ్ల ఫోన్ల కంటే మెరుగైన ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ మరియు దాని రక్షణ కేస్ యొక్క అనేక నివేదికలు మరియు లీక్‌లు గతంలో అనేక స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్‌లను సూచించాయి.

Google Pixel 7a Complete Specifications Leaked,Expected To Have 64MP Camera,4400mAh Battery And 20W Charger

ఇప్పుడు, మరొక కొత్త నివేదిక ప్రకారం దాని విడుదలకు ముందు పిక్సెల్ 7a యొక్క పూర్తి స్పెసిఫికేషన్‌ల జాబితా లీక్ అయిందని పేర్కొంది. ఆ వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.
విశ్వసనీయమైన టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (@heyitsyogesh) సమాచారం ప్రకారం 91మొబైల్స్ నివేదికలో తెలిపినట్లు, పిక్సెల్ 7a స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ ఉన్న ఫోన్, ఆండ్రాయిడ్ 13 తో వస్తుందని భావిస్తున్నారు.

ఈ పిక్సెల్ 7a ఫోన్, గత అక్టోబర్ 2022లో లాంచ్ చేయబడిన టెన్సర్ G2 చిప్‌సెట్ ద్వారా పనిచేసే అవకాశం ఉంది. పిక్సెల్ 7 మరియు పిక్సెల్ 7 ప్రో ఫోన్లు కూడా ఇదే టెన్సర్ G2 చిప్‌సెట్ తో వస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR5 RAMతో జత చేయబడుతుందని మరియు 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీ తో వస్తుందని తెలుస్తోంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, పిక్సెల్ 7a యొక్క డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు అల్ట్రా వైడ్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. సెల్ఫీల కోసం 10.8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డిస్ప్లే పంచ్-హోల్ స్లాట్‌లో అమర్చబడి ఉంటుంది.

ఇంకా,ఈ ఫోన్ 20W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 72 గంటల వరకు బ్యాకప్ అందించడానికి తయారు చేయబడిన 4,400mAh బ్యాటరీ యూనిట్ ని ప్యాక్ చేయబడుతుందని భావిస్తున్నారు, ఈ పిక్సెల్ 7a వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుందని చెప్పబడింది. ఇక భద్రత కోసం, ఈ ఫోన్లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇంతకు ముందు వెలువడిన లీక్ ల ప్రకారం, పిక్సెల్ 7a మూడు రంగుల వేరియంట్‌లలో లాంచ్ అవుతుందని సమాచారం ఉంది. అవి, బూడిద, తెలుపు మరియు నీలం రంగులు. వీటిని అధికారికంగా చార్‌కోల్, స్నో మరియు సీ అని పిలుస్తారు. మరొక నివేదిక ప్రకారం ఈ ఫోన్ యొక్క ధర కూడా లీక్ అయింది. USలో ఈ పిక్సెల్ 7a ఫోన్ ధర $499 (దాదాపు రూ. 40,900) ఉంటుందని అంచనాలున్నాయి.

Best Mobiles in India

English summary
Google Pixel 7a Complete Specifications Leaked,Expected To Have 64MP Camera,4400mAh Battery And 20W Charger
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X