ఫ్లిప్‌కార్ట్ సేల్ 2024.. గూగుల్ పిక్సల్ ఫోన్ ధర తగ్గింపు.. ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే..!
గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్లు గూగుల్ I/O ఈవెంట్ 2023లో విడుదల అయ్యాయి. అనంతరం అక్టోబర్ 2023లో గూగుల్ పిక్సల్ 8 మరియు గూగుల్ పిక్సల్ 8 ప్రో హ్యాండ్‌సెట్లు లాంచ్ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరను పొందింది. ఈ ఫోన్‌ను రూ.34,499 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 11 శాతం డిస్కౌంట్ ధరను కలిగి ఉంది. అంటే రూ.38999గా ఉంది. ICICI, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 12 నెలలపాటు Spotify ప్రీమియంను రూ.699కే పొందవచ్చు. ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా మరో రూ.3000 అదనపు తగ్గింపును పొందవచ్చు.

పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల పుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది మరియు 90Hz రీప్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే రక్షణకు గొరెల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంటుంది. అండర్ ది హుడ్ ఈ హ్యాండ్‌సెట్ టెన్సార్ G2 చిప్‌పైన పనిచేస్తుంది. మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రోసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 13 ఆధారిత OS పైన పనిచేస్తుంది.
గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాలు : గూగుల్ పిక్సల్ 7a స్మార్ట్ ఫోన్ 18W వైరడ్, Qi సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4300mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ IP67 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. మరియు బ్లూటూత్ 5.3, వైఫై 6, NFC మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది.

గూగుల్ పిక్సల్ 7a కెమెరా వివరాలు : పిక్సల్ 7a ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. అదే ముందువైపు 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2024 జనవరి 13న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయింది. ఈనెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు సేల్ అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా ఇతర గ్యాడ్జెట్ల పై ఆకర్షణీయ తగ్గింపును అందిస్తోంది. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








