Home
News

Google Pixel 8 సీరిస్‌ ఫోన్లు.. కెమెరాలపై ప్రత్యేక ఫోకస్‌..!

టెక్‌ దిగ్గజం గూగుల్ ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశం Google I/Oలో పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో ఫోన్లపై ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కానీ గూగుల్‌ పిక్సల్‌ 8 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్, కెమెరాలు, ఇతర ఫీచర్లపై రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ ఫోన్ డిజైన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే బయటకువచ్చాయి. ఈ ఫోటోల ఆధారంగా పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్ కొంచెం చిన్నదిగా అనిపించింది. పిక్సల్‌ 8 ప్రో మాత్రం ప్లాట్‌ లుక్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌పై మరింత ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

Google Pixel 8 and 8 pro

పిక్సల్‌ 7లో కెమెరా విభాగంలో చిన్నపాటి మార్పులు చేశారు. కానీ గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌లో కొత్త హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు వచ్చే అవకాశం ఉందని ఆండ్రాయిడ్‌ ఆథారిటీ నివేదిక వెల్లడించింది. గూగుల్‌ పిక్సల్‌ 8 మరియు పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్‌ గెలాక్సీ S23 50MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

గూగుల్‌ పిక్సల్‌ 8 సీరిస్‌ ఫోన్లు 50MP శాంసంగ్‌ ISOCELL GN2 సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. గెలాక్సీ S22. S23 స్మార్ట్‌ఫోన్లు ఈ తరహా సెన్సార్లను కలిగి ఉన్నాయి. GN1 సెన్సార్ల కంటే GN2లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. జీఎన్‌1 సెన్సార్లను పిక్సల్‌6 మరియు పిక్సల్‌ 7 సీరిస్‌ ఫోన్లలో వినియోగించారు.

GN2 సెన్సార్లు 35 శాతం అధికంగా వెలుతురును సంగ్రహించగలదు. మరియు తక్కువ వెలుతురులోనూ మంచి పనితీరును కనబరుస్తుంది. దీంతోపాటు ఆధునిక ఫీచర్లను సపోర్టు చేయనుంది. 8k/30fps నాణ్యతతో వీడియోలను HDRలో రికార్డు చేయవచ్చు. ఫోటో నాణ్యతను మెరుగుపరిచేందుకు గూగుల్ వీటిని ఉపయోగించేం అవకాశం ఉంది.

పిక్సల్‌ 7 స్మార్ట్‌ఫోన్లలో వినియోగించిన 12MP ఆల్ట్రావైడ్‌ కెమెరాలను పిక్సల్‌ 7a ఫోన్లలో వినియోగించిన 64MP సోనీ IMX787 సెన్సార్‌తో మార్చే అవకాశం ఉంది. దీంతో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఫలితంగా మంచి నాణ్యతలో ఫోటోలు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న పిక్సల్‌ 8 ప్రోలో మాక్రో సెన్సార్లు లేనట్లు తెలుస్తోంది.

అయితే చివరి దశలో వీటిని పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. వీటితో పాటు గూగుల్‌ 8 ప్రో కొత్తగా ToF సెన్సార్లను వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పిక్సల్‌ 8లో ఇప్పటికీ IMX386 లెన్స్‌లు వినియోగిస్తు్న్నారు. కానీ వైడ్‌ వ్యూ కోసం మరో లెన్స్‌ను జతచేయవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 7 మరియు 7 ప్రోలో ఉన్నట్లుగానే టెలిఫోటో కెమెరాలను పిక్సల్‌ 8 మరియు పిక్సల్‌ 8 ప్రో కలిగి ఉండనుంది. వీటితో పాటు కొన్ని సాఫ్ట్‌వేర్‌ ఫీచర్లను పిక్సల్‌ 8 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. సినిమాటిక్ ఫీచర్‌తో బొకేష్ ఎఫెక్ట్‌ను మెరుగుపరిచే అవకాశం ఉంది. ఆడాప్టివ్‌ టార్చ్‌ పేరుతో కొత్త ఫీచర్‌ తీసుకురానుందని తెలుస్తోంది. దీంతో ఫోటోలు అతిగా బహిర్గతం కాకుండా (Overexposed) ప్లాష్‌ మాడ్యుల్‌ను ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Google Pixel 8 and 8 pro may have 50MP galaxy S23 cameras
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X