Home
News

గూగుల్ పిక్సల్ 8 కొత్త స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ధర, సేల్‌ వివరాలు..!!

గూగుల్ పిక్సల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు గత సంవత్సరం అక్టోబర్‌లో భారత్‌లో విడుదల అయ్యాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ జనవరి 25న విడుదల అయింది. మింట్‌ గ్రీన్‌ కలర్‌లో ( Google pixel 8 Price drop ) అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ భారీ డిస్కౌంట్‌తో ప్రముఖ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్డులో అందుబాటులో ఉంది.

గూగుల్‌ పిక్సల్‌ 8 ధర, డిస్కౌంట్లు : మింట్‌ కలర్‌ గూగుల్‌ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ప్రస్తుత ధర రూ.75,999 గా ఉంది. దీంతోపాటు యాక్సిస్‌ బ్యాంకు, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు, ICICI బ్యాంకు, HDFC బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.12,000 వరకు తగ్గింపును పొందవచ్చు.

Google pixel 8 mint green colour smartphone

రూ.24,000 వరకు తగ్గింపు : దీంతోపాటు ఎక్స్చేంజీ ద్వారా గరిష్ఠంగా రూ.66,990 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఎంపిక చేసిన మోడళ్ల ఎక్స్చేంజీపైన రూ.12,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇలా రూ.24,000 తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ ఎప్పటి వరకు ఉంటుందో ఫ్లిప్‌కార్టు వెల్లడించలేదు.

గూగుల్‌ పిక్సల్‌ 8 స్పెసిఫికేషన్లు..
గూగుల్‌ పిక్సల్‌ 8 స్మా్ర్ట్‌ఫోన్‌ 129Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.2 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విస్టస్‌ రక్షణను పొందుతుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత క్లీన్‌ OSపైన పనిచేస్తుంది. 7 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు ఇస్తామని గూగుల్‌ హామీ ఇచ్చింది.

గూగుల్‌ పిక్సల్‌ 8 కెమెరాలు : గూగుల్‌ పిక్సల్‌ 8 వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్‌ 8 సోనీ IMX386 సెన్సార్‌, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 10.5MP కెమెరాను అమర్చారు.

గూగుల్‌ పిక్సల్‌ బ్యాటరీ, ఛార్జింగ్‌ వివరాలు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 27W వైరడ్‌ ఛార్జింగ్‌, 18W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4,575mAh బ్యాటరీని ( Google Pixel 8 Mint Green Colour Smartphone ) కలిగి ఉంటుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC మరియు USB-C మరియు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 8 mint green colour smartphone gets massive discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X