Home
News

ఇండియాలో Google Pixel 8 సేల్ మొదలైంది. ఈరోజే ! ధర, ఆఫర్లు

By Maheswara

గూగుల్ గత వారం మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో తమ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లని విడుదల చేసింది. అయితే ఇప్పుడు, ఈ రోజు నుంచి భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 6.2-అంగుళాల స్క్రీన్, కర్వియర్ ఎడ్జ్‌లు మరియు 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో 128 GB మరియు 256 GB. తో వస్తుంది.

ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు అక్టోబర్ 5 నుండి ప్రారంభమయ్యాయి. మరియు ఇప్పుడు మొదటి సేల్ మొదలైంది. గూగుల్ పిక్సెల్ అభిమానులు ఈ ఫోన్ ను పొందేందుకు ఉత్సాహంగా ఉన్నారు. గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ రూ. 75,999 ధరతో ప్రారంభించబడింది. ఇది దాని ముందున్న ధర కంటే ఎక్కువ. ఒకసారి గుర్తుచేసుకుంటే, గూగుల్ పిక్సెల్ 7 లాంచ్ సమయంలో దాని ధర రూ. 59,999 గా ఉండేది.

Google Pixel 8 Sale Live Now In India. Price, Specification And Bank Offers Details Here.

అయితే Google Pixel 8 ఫోన్ ను మీరు ఇప్పుడు రూ.64,999 కి పొందవచ్చని తెలుసుకోండి. అవును, మీరు చదివింది నిజమే. ఎలాగో తెలుసుకోవాలంటే చదవండి.

గూగుల్ పిక్సెల్ 8పై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ డీల్
ఫ్లిప్కార్ట్ లో Pixel 8 సిరీస్ రాకను ప్రకటించే ల్యాండింగ్ పేజీని కలిగి ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ఈరోజు, అక్టోబర్ 12, మధ్యాహ్నం 12:00 గంటల నుండి అమ్మకాలు మొదలయ్యాయి. ఇప్పటికే చెప్పినట్లుగా, ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది - 128GB మరియు 256 GB. అలాగే మీరు మూడు రంగులలో వస్తుంది. అవి రోజ్, హాజెల్ మరియు అబ్సిడియన్ రంగులు .

ఈ ఫోన్ యొక్క 128 GB వేరియంట్ ధర రూ.75,999. అయితే, ఫ్లిప్‌కార్ట్ లో రూ. 8,000 వరకు బ్యాంక్ తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది. ఈ బ్యాంక్ ఆఫర్లు ICICI, కోటక్ మహీంద్రా మరియు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనంగా రూ.3,000 తగ్గింపు ఆఫర్ ఉంటుంది. కాబట్టి, ఈ ఆఫర్‌ ను ఉపయోగించుకోవడం ద్వారా గూగుల్ పిక్సెల్ 8 మీకు దాదాపు రూ. 64,999 ధరకు లభిస్తుంది.

అలాగే, పిక్సెల్ 8 ప్రో విషయంలో కూడా, ఇలాంటి ఆఫర్‌లను ఉపయోగించి, ప్రభావవంతమైన ధరను రూ.93,999 కి తగ్గించవచ్చు. పిక్సెల్ 8 ప్రో భారతదేశంలో రూ. 1,06,999 ధరతో లాంచ్ చేయబడింది.

Google Pixel 8 స్పెసిఫికేషన్ల వివరాలు
గూగుల్ పిక్సెల్ 8 దాని ముందు తరాల ఫోన్ల మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 8 యొక్క అంచులు వంకరగా ఉంటాయి మరియు Pixel 7తో పోల్చినప్పుడు ఫోన్ కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఈ ఫోన్ గ్లాస్ మరియు అల్యూమినియం బిల్డ్ కలిగి ఉంది.

120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది. గూగుల్ సమాచారం ప్రకారం, డిస్ప్లే "వాస్తవ-ప్రపంచ స్పష్టతను కలిగి ఉంది మరియు పిక్సెల్ 7 డిస్ప్లే కంటే 42 శాతం ప్రకాశవంతంగా ఉంది".

గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ సంస్థ యొక్క తదుపరి తరం ప్రాసెసర్, టెన్సర్ G3 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ కెమెరా పరంగా పెద్ద అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ ఆక్టా-PD ప్రధాన కెమెరా, 8x సూపర్-రెస్ డిజిటల్ జూమ్ మరియు ఆటోఫోకస్ మరియు మాక్రో సామర్ధ్యాలతో 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో, సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

బ్యాటరీ గురించి తెలుసుకుంటే, ఈ పిక్సెల్ 8 ఫోన్ 4,575 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 27W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్లో గూగుల్ 18W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును జోడించింది. అయితే, ఈ ఫోన్ యొక్క రిటైల్ ప్యాకేజీలో ఎటువంటి ఛార్జర్ ని ఇవ్వలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 8 Sale Live Now In India. Price, Specification And Bank Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X