Home
News

స్మార్ట్‌ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ అయినా కూడా లోకేషన్‌ను ట్రాకింగ్‌ చేయవచ్చు... పూర్తి వివరాలు..!

స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం జీవనశైలిలో ఓ భాగం అయింది. ఫోన్‌ కాల్స్‌ నుంచి బ్యాంకు సహా ఇతర పనులు చాలా వరకు అన్ని స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే చేసేస్తున్నాం. దాంతోపాటు వ్యక్తిగత, సున్నిత సమాచారం కూడా స్మార్ట్‌ఫోన్‌లో సేవ్‌ చేస్తున్నాం. అయితే ఏదైనా సందర్భంలో ఫోన్‌ దొంగిలించబడినా లేదా ఎక్కడైనా పోగొట్టుకున్నా అనేక ఇబ్బందులు (Smartphone Offline tracking) ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే ఫోన్ లోకేషన్‌ ట్రాక్‌ చేసేందుకు అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో చాలా ఫీచర్లు ఫోన్‌ ఇంటర్నెట్‌కు లేదా హ్యాండ్‌సెట్‌ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. అయితే తాజాగా ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టెగ్ దిగ్గజం గూగుల్‌ కీలక ఫీచర్‌ను విడుదల చేసింది. ఫోన్ స్విచ్‌ ఆఫ్‌లో ఉన్న సమయంలో కూడా హ్యాండ్‌సెట్ లోకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.

Google pixel 8 offline location tracking

గూగుల్‌ పిక్సల్ 8 సిరీస్‌ (Google Pixel 8 Series) స్మార్ట్‌ఫోన్‌లు తాజాగా వచ్చిన అప్‌గ్రేడ్‌ ద్వారా ఇది సాధ్యమైంది. ఈ హ్యాండ్‌సెట్‌లోని అడ్వాన్సడ్‌ Find My Device Network ఫీచర్‌ ద్వారా డివైస్‌ బ్యాటరీ పూర్తిగా డిశ్ఛార్జి అయినా కానీ లోకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చు. ప్రత్యేకమైన పిక్సల్‌ హార్డ్‌వేర్ ద్వారా ఈ ఆఫ్‌లైన్ ట్రాకింగ్‌ సాధ్యమైందని గూగుల్‌ తెలిపింది.

గూగుల్‌ ఫోన్‌లోని బ్లూటూత్‌ చిప్‌కు అవసరమైన రిజర్వ్‌ పవర్‌ ఈ హ్యాండ్‌సెట్‌లో ఉంటుంది. ఫలితంగా అనేక గంటలపాటు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిన తర్వాత కూడా లోకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చని గూగుల్ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఈ ఆఫ్‌లైన్ ట్రాకింగ్‌ ఫీచర్‌ పిక్సల్‌ ఫోల్డ్‌ 2 మరియు పిక్సల్‌ 9, 9 ప్రో లోనూ ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను ఆపిల్‌ ఇటీవల విడుదలైన తన ఫోన్‌లో కలిగి ఉంది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకున్నా మరియు ఫోన్‌ పూర్తిగా స్విచ్‌ ఆఫ్‌ అయినా కూడా హ్యాండ్‌సెట్‌ లోకేషన్‌ను ట్రాకింగ్‌ చేయవచ్చు. శాంసంగ్ కూడా ఇదే తరహా ఫీచర్‌ను కలిగి ఉంది.

అయితే మే నెలలో నిర్వహించే గూగుల్ i/O విడుదల కానుందని భావిస్తున్న పిక్సల్‌ 8a ఈ ఫీచర్‌ను కలిగి ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. గతంలో వెల్లడైన వివరాల ప్రకారం గూగుల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల పుల్‌ HD+ (1080*2400 పిక్సల్‌) OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 1400 నిట్స్‌ HDR బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ గత నెల US ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌ (FCC) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇటీవల బ్లూటూత్‌ special interest Group (SIG) వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ వెబ్‌సైట్‌ ఆధారంగా 8a స్మార్ట్‌ఫోన్ వేర్వేరు మోడల్ నంబర్‌లతో కనిపించింది. G8HNN, GKV4X, G6GPR and G576D మోడల్ నంబర్లలో కనిపించింది.

ఈ వెబ్‌సైట్‌లోని వివరాల ఆధారంగా ఈ గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 5.4 బ్లూటూత్‌ కనెక్టివిటిని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. దీంతోపాటు ఈ పిక్సల్‌ 8a హ్యాండ్‌సెట్‌ టెన్సార్‌ G3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 64MP ప్రైమరీ కెమెరా 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ మరో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel 8 series can be tracked even in device switched off
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X