Google Pixel 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కీలక వివరాలు లీక్.. !
టెక్ దిగ్గజం గూగుల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Google Pixel 8, pixel 8 Pro స్మార్ట్‌ఫోన్లు గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఫోన్లు అక్టోబర్ 4న మేడ్ బై గూగుల్ కార్యక్రమంలో లాంచ్ అయ్యాయి. అయితే ఈ రెండు ఫోన్ల కలర్ ఆప్షన్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి.
మైస్మార్ట్ ప్రైస్ వెబ్‌సైట్ ఆధారంగా ఈ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో ఆధారంగా ఈ రెండు ఫోన్లు మూడు కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటాయి. పిక్సల్ 8 బ్లాక్ అబ్సిడియన్, గ్రే మరియు పియోనీ రోజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అదే పిక్సల్ 8 ప్రో బ్లాక్ అబ్సిడియన్, పింగాణీ, స్కై బ్లూ రంగుల్లో లభించనుంది. అయితే దీనిపై గూగుల్ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

పిక్సల్ 8 ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది విజర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. అలాగే పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ విజర్ ఆకారంలో కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుంది. మరియు వెనుక వైపు LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను కలిగి ఉంటుంది.
గూగుల్ పిక్సల్ 8 సిరీస్ ఫోన్ అంతర్గత టెన్సర్ G3 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. దీంతోపాటు 9 కోర్ CPU లేఅవుట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 14పై పనిచేయనున్నాయని సమాచారం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో రానున్నాయి.
దీంతోపాటు గూగుల్ పిక్సల్ 8 ప్రో ఫోన్ 27W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,950mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే పిక్సల్ 8 ఫోన్ 24W వైర్డ్ ఛార్జింగ్ మరియు 12W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 4,485mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.
గూగుల్ 8 పిక్సెల్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర (భారత కరెన్సీ ప్రకారం ) రూ.78,000 ఉంటుందని తెలుస్తోంది. అదే 256GB వేరియంట్ సుమారు రూ.85,200గా ఉంటుందని సమాచారం. అదే గూగుల్ పిక్సల్ 8 ప్రో 128GB స్టోరేజీ మోడల్ సుమారుగా రూ.1,10,900గా ఉంటుంది. అదే 256GB రూ. 1,17,500గా ఉంటుంది. 512GB స్టోరేజీ వేరియంట్ రూ.1,31,100గా ఉండే అవకాశం ఉంది.
గూగుల్ మేడ్ బై కార్యక్రమం అక్టోబర్ 4న న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు (సాయంత్రం 7:30 IST) నిర్వహించనుంది. అక్టోబర్ 5 నుంచి ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయని గూగుల్ ఇప్పటికే వెల్లడించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








