Google Pixel 8 సిరీస్ ఫోన్లు, పిక్సల్ వాచ్ 2 విడుదల.. ఫీచర్లు, ధర, సేల్ వివరాలు
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Google Pixel 8, Pixel 8 Pro స్మార్ట్‌ఫోన్లు సహా, పిక్సల్ వాచ్ 2 విడుదల అయ్యాయి. మేడ్ బై గూగుల్ (Made by google) కార్యక్రమంలో వీటిని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు టెన్సర్ G3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. మరియు ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా ఆధారంగా పనిచేస్తుంది.
స్టాండర్డ్ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో గూగుల్ AI ఆధారిత ఫోటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్సిలేట్ ఫీచర్లను కలిగి ఉంటాయి. దీంతోపాటు 7 సంవత్సరాల పాటు గూగుల్ నుంచి సాఫ్ట్‌వేర్ సపోర్టు పొందనున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కెమెరా సహా ఇతర విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనేక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

గూగుల్ పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లోనే లభించనుంది. ఈ ఫోన్ ధర రూ.75,999గా ఉంది. ఈ ఫోన్ హాజెల్, అబ్సిడియన్, రోజ్ కలర్ ఎంపికల్లో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. అలాగే పిక్సల్ 8 ప్రో 128GB స్టోరేజీ మోడల్ రూ.1,06,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బే, అబ్సిడియన్, పింగాణి రంగుల్లో లభిస్తుంది.
గూగుల్ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లతోపాటు గూగుల్ Pixel Watch 2ను కూడా విడుదల చేసింది. ఈ వాచ్ ధర రూ.39,900 గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఇవాళ్టి నుంచి ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ నుంచి ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు.

గూగుల్ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు డ్యూయల్ సిమ్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. మరియు ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ పైన పనిచేస్తాయి. పిక్సల్ 8 ఫోన్ 6.2 అంగుళాల పుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది.
అదే పిక్సల్ 8 ప్రో 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ HD స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు గూగుల్ నానో కోర్ టెన్సర్ G3 చిప్‌సెట్ సహా టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌ను కలిగి ఉంటాయి.
గూగుల్ పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ GN2 సెన్సార్, f/1.68 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు పిక్సల్ 8 సోనీ IMX386 సెన్సార్, f/2.2 అపేచర్‌తో 12MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.
అదే పిక్సల్ 8 ప్రో సోనీ IMX787 సెన్సార్, f/2.8 అపేచర్‌తో 64MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రో మోడల్ శాంసంగ్ GMS సెన్సార్‌తో f/1.95 అపేచర్‌తో 48MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ముందువైపు f/2.2 అపేచర్‌తో 11MP కెమెరాను అమర్చారు.
ఈ రెండు పిక్సల్ స్మార్ట్‌ఫోన్లు వైఫై 6E, 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు యాక్సెలోమీటర్, బారోమీటర్, గైరోస్కోప్, మాగ్నోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
భారత్‌లో తొలిసారిగా గూగుల్ పిక్సల్ వాచ్2 ను విడుదల చేసింది. ఈ వాచ్ ధర రూ.39,990గా ఉంది. దీనిని పూర్తిగా రీసైకిల్డ్ అల్యూమినియంతో తయారుచేశారు. 1.2 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. 383*384 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ W5+ జెన్ 1 ప్రాససర్‌పైన పనిచేస్తుంది.
ఈ వాచ్ బ్యాటరీ 306mAhగా ఉంది. కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటలపాటు వినియోగించుకోవచ్చు. ఈ వాచ్ 2 అనేక హెల్త్ ట్రాకర్లను కలిగి ఉంది. ఫాల్ డిటెక్షన్, ఎమర్జెన్సీ SOS, మెడికల్ ID వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటాయి. ఈ వాచ్ ఫాలిష్డ్ సిల్వర్, మ్యాటీ బ్లాక్, షాంపైన్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








