గూగుల్ నుంచి కొత్త ఫోన్.. బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు లీక్..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి మరో కొత్త ఫోన్ ఈ సంవత్సరం విడుదల కానుంది. గూగుల్ పిక్సల్ 8 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగంపై కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి.
గూగుల్ పిక్సల్ 8 సీరిస్ స్మార్ట్‌ఫోన్లపై ఆండ్రాయిడ్ ఆథారిటీ కీలక విషయాలు వెల్లడించింది. గూగుల్ పిక్సల్ 8 మరియు పిక్సల్ 8 ప్రో 24W మరియు 27W ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తాయని తెలిపింది. అదే గూగుల్ పిక్సల్ 7 మరియు పిక్సల్ 7 ప్రో 20W, 23W ఛార్జింగ్ సపోర్టు చేస్తున్నట్లు గుర్తుచేసింది. అయితే వైర్‌లెస్ ఛార్జింగ్‌లో ఎటువంటి మార్పులు ఉండవని వెల్లడించింది.

గూగుల్ పిక్సల్ 7 సీరిస్ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఛార్జింగ్ వేగంతోపాటు బ్యాటరీ సామర్థ్యంలోనూ పిక్సల్ 8 సీరిస్‌లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. పిక్సల్ 8 ఫోన్ 4,485mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అదే విధంగా పిక్సల్ 8 ప్రో 4,950mAh బ్యాటరీతో రానున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ పిక్సల్ 8 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు Wi-Fi 7 సపోర్టును కలిగి ఉంటాయని సమాచారం. మరియు ఆల్ట్రావైడ్ బ్యాండ్ చిప్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఈ చిప్ కేవలం ప్రో మోడళ్లు మాత్రమే ఇప్పటి వరకు కలిగి ఉంటున్నాయి. అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది.
అదే విధంగా ఈ ఫోన్ డిస్‌ప్లే, డిజైన్ వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. వాటి ప్రకారం గూగుల్ పిక్సల్ 8 6.17 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది. అయితే పిక్సల్ 8 ప్రో మాత్రం 6.7 అంగుళాల డిస్‌ప్లేతో రానుందని తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లు Tensor G3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయని సమాచారం.
పిక్సల్ 8 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా మరియు 12MP ఆల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే పిక్సల్ 8 ప్రో మాత్రం మరింత మెరుగైన కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రధాన కెమెరా, 64MP ఆల్ట్రావైడ్ కెమెరా మరియు 50MP టెలీఫోటో లెన్స్, థర్మోమీటర్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
గూగుల్ పిక్సల్ 8 మరియు పిక్సల్ 8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్‌పై గూగుల్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల సమయంలో ఈ ఫోన్‌పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరలో ఈ ఫోన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








