Home
News

Google Pixel 8 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ కానున్నాయి.. లైవ్‌ ఎక్కడ చూడాలి..!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌ ఇవాళ Made By Google కార్యక్రమం నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో గూగుల్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Google Pixel 8, Pixel 8 Pro స్మార్ట్‌ఫోన్లు సహా పిక్సల్‌ వాచ్‌2ను విడుదల చేస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు పిక్సల్‌ 7, పిక్సల్‌ 7 ప్రో ఫోన్లకు తర్వాత తరం ఫోన్లుగా రానున్నాయి.

మేడ్‌ బై గూగుల్‌ కార్యక్రమాన్ని గూగుల్ అధికారిక వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ ద్వారా వీక్షించవచ్చు. ఈరోజు సాయంత్రం 07:30 PM IST ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ లాంచ్‌ కార్యక్రమం అనంతరం పిక్సల్‌ 8, పిక్సల్‌ 8 ప్రో ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. అయితే పిక్సల్‌ వాచ్‌ 2 మాత్రం అక్టోబర్ 5 నుంచి ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది.

Google Pixel 8 series smartphones launch

Google Pixel 8 : ఈ స్మార్ట్‌ఫోన్‌ గూగుల్‌ పిక్సల్‌ 7 తర్వాత తరం ఫోన్‌. ఇది 6.2 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. మరియు టెన్సర్‌ G3 చిప్‌ను కలిగి ఉంటుంది.

గూగుల్ పిక్సల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌ 4575mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 50MP + 12MP కెమెరాలను కలిగి ఉంటుంది. అదే విధంగా ఫోన్ ముందువైపు 10.5MP కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది. లాంచ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

Google Pixel 8 series smartphones launch

Google Pixel 8 Pro : ఈ స్మార్ట్‌ఫోన్‌ గూగుల్‌ పిక్సల్‌ 7 ప్రో ఫోన్‌కు తర్వాత తరం ఫోన్‌గా వచ్చింది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు టెన్సర్‌ G3 చిప్‌సెట్‌తో వస్తుంది. మరియు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ వెనుకవైపు 50MP+ 48MP+ 48MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు ముందువైపు 10.5MP కెమెరాను కలిగి ఉంటుంది.

Pixel Watch 2 : ఈ స్మార్ట్‌వాచ్‌ 1.2 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ W5 జెన్‌ 1 CPU, WearOS 4 ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. మరియు ఈ స్మార్ట్‌వాచ్‌ 306mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు అనేక హెల్త్‌ ట్రాకింగ్‌ సెన్సార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

మేడ్‌ బై గూగుల్‌ ఈవెంట్‌లో పిక్సల్‌ బడ్స్‌ ప్రోను మరో రెండు రంగుల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు గూగుల్‌ ఫోన్లకు ఆండ్రాయిడ్‌ 14 OSను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే దీనిపై సంస్థ నుంచి ఎటువంటి సమాచారం లేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Google Pixel 8 series smartphones willbe launched in made by google event on october 4th
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X