Home
News

గూగుల్‌ నుంచి కొత్త బడ్స్‌, వాచ్ 4 విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు!

మేడ్ బై గూగుల్‌ ఈవెంట్‌లో పిక్సల్‌ 10 సిరీస్‌తోపాటు పిక్సల్‌ బడ్స్‌ 2a, పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2, పిక్సల్‌ వాచ్‌ 4 కూడా విడుదల అయ్యాయి. ఈ పిక్సల్‌ 10 సిరీస్‌లో భాగంగా పిక్సల్‌ 10, పిక్సల్‌ 10 ప్రో, పిక్సల్ 10 ప్రో XL, పిక్సల్‌ 10 ప్రో ఫోల్డ్‌ మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి.

గూగుల్‌ పిక్సల్‌ బడ్స్ 2a :
ఈ బడ్స్‌ 11mm డైనమిక్‌ డ్రైవర్స్‌, గూగుల్‌ టెన్సార్‌ A1 చిప్‌ను కలిగి ఉంది. మరియు ANC సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్‌ బ్లూటూత్‌ 5.4 పైన పనిచేస్తాయి. ఈ బడ్స్‌ ప్రత్యేక సెన్సార్‌లతోపాటు టచ్‌ కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది.

google pixel buds 2a

ఈ పిక్సల్‌ బడ్స్ 2a ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 27 గంటల (ANC Off) వరకు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు. అదే ANC ఫీచర్‌ను ఆన్‌ చేసి ఉపయోగిస్తుంటే బ్యాటరీ లైఫ్‌ 20 గంటలుగా ఉంటుంది. IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.

పిక్సల్ బడ్స్‌ ప్రో 2 :
ఈ బడ్స్‌ 11 డ్రైవర్స్‌తోపాటు టెన్సార్‌ A1 చిప్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు అడాప్టివ్ ఆడియో ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. త్వరలో వచ్చే అప్‌డేట్‌తో లౌడ్‌ నాయిస్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీంతోపాటు అనేక సెన్సార్‌లను కలిగి ఉంది.

పిక్సల్ బడ్స్‌ ప్రో 2 బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా చార్జింగ్‌ చేసి గరిష్ఠంగా 30 గంటల ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు. అదే ANC ఆన్ చేసి ఉపయోగిస్తుంటే మాత్రం 8 గంటల వరకు ప్లేబ్యాక్‌ టైంను పొందవచ్చు. అయితే ఆడియో క్వాలిటీ పరంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

google pixel buds 2a

గూగుల్‌ పిక్సల్‌ బడ్స్‌ 2a ధర రూ.12999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా త్వరలో అందుబాటులోకి రానుంది. హాజల్‌, ఐరిస్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఫ్లి్ప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. అదే పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2 ధర రూ.22990 గా ఉంది.

పిక్సల్‌ వాచ్‌ 4 :
స్మార్ట్‌ఫోన్ సిరీస్‌, పిక్సల్‌ బడ్స్‌ 2a, పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2 తోపాటు పిక్సల్‌ వాచ్‌ 4 కూడా విడుదల అయింది. 41mm, 45mm రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ పిక్సల్‌ వాచ్‌ 4 అమోలెడ్‌ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ అక్వా 360 Always On display ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3D కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ‌ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 320ppi డెన్సిటిని కలిగి ఉంది. బ్లూటూత్‌ 6.0 పైన పనిచేస్తుంది. వాచ్‌ ఆండ్రాయిడ్ 11 లేదా తర్వాత వెర్షన్స్‌ పైన పనిచేస్తుంది. దీంతోపాటు అనేక సెన్సార్‌లను కలిగి ఉంది. మరియు 5 ATM రేటింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.

google pixel buds 2a

ఈ పిక్సల్‌ వాచ్‌ 41mm వేరియంట్‌ 325mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆ‌ల్‌వేజ్‌ ఆన్‌ డిస్‌ప్లే ఆప్షన్‌లో 30 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అదే బ్యాటరీ సేవర్ మోడ్‌ను 48 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. 45mm వేరియంట్‌ 455mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ వాచ్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఆల్‌వేజ్‌ ఆన్‌ డిస్‌ప్లే ఆప్షన్‌లో 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అదే బ్యాటరీ సేవర్‌ మోడ్‌లో 72 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ వాచ్‌ 41mm వేరియంట్‌ లెమన్‌గ్రాస్, పార్సిలియన్‌, ఒబ్సిడియన్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

అదే 45mm వేరియంట్‌ మూన్‌స్టోన్‌, పార్సిలియన్‌, ఒబ్సిడియన్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. 41mm వేరియంట్ ప్రారంభ ధర రూ.39900 గా ఉంది. అదే 45mm వేరియంట్ ప్రారంభ ధర రూ.43900 గా ఉంది. త్వరలో సేల్‌ తేదీ వెల్లడి కావాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Google pixel buds 2a, pixel buds pro 2, pixel watch 4 launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X