Home
News

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2025... రూ.35 వేల కంటే తక్కువ ధరకే గూగుల్‌ పిక్సల్‌ 9 స్మార్ట్‌ఫోన్‌!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2025 సేల్‌ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్‌ మెంబర్లకు 24 గంటల ముందుగానే పాల్గొనే అవకాశం ఉంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ క్రమంగా అనేక వివరాలను వెల్లడిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి గ్యాడ్జెట్‌లు సహా ఇతర గృహోపకరణాలపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్‌ల డిస్కౌంట్‌ (Google Pixel Smartphones Deals on Flipkart Sale) వివరాలు వెల్లడయ్యాయి.

ఈ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా యాక్సెస్‌, ICICI బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజీ బోనస్‌, నో కాస్ట్‌ EMI ఆఫర్‌లను పొందవచ్చు.

flipkart big billion days 2025 sale

గూగుల్‌ పిక్సల్స్‌ ఫోన్‌లపై డిస్కౌంట్‌లు :
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ సేల్‌ 2025 లో భాగంగా పిక్సల్‌ 7 ఫోన్ల నుంచి పిక్సల్‌ 10 సిరీస్‌ వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇందుకు సంబంధించిన డిస్కౌంట్‌ల వివరాలను వెల్లడయ్యాయి. దీంతోపాటు బ్యాంకులు, ఎక్స్ఛేంజీ బోనస్‌ వంటి వివరాలు వెల్లడయ్యాయి.

రూ.34,999 ధరకే గూగుల్ పిక్సల్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్ డేస్ సేల్‌ 2025 లో భాగంగా గూగుల్‌ పిక్సల్‌ 9 మోడల్‌ను రూ.34,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఒరిజినల్‌ ధర రూ.79,999 గా ఉంది. అదే పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ ను రూ.99,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.1,72,999 ధరకు విడుదల అయింది.

రూ.49,999 వేల ధరకే పిక్సల్‌ 9a స్మార్ట్‌ఫోన్ :
గూగుల్‌ పిక్సల్‌ 9 ప్రో XL స్మార్ట్‌ఫోన్‌ రూ.84999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1,24,999 గా ఉండేది. గూగుల్‌ పిక్సల్‌ 9 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ పిక్సల్‌ 9a రూ.49,999 ధరకు విడుదల అయింది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో రూ.41,999 కే సొంతం చేసుకోవచ్చు.

పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ధర :
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా పిక్సల్‌ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ను రూ.44,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ను రూ.29,999 కే సొంతం చేసుకోవచ్చు. గూగుల్‌ పిక్సల్‌ 7 స్మార్ట్‌ఫోన్‌ ను రూ.27999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

గూగుల్‌ పిక్సల్‌ 10 సిరీస్‌ ఫోన్‌లపై డిస్కౌంట్‌ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ 2025 లో భాగంగా పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ రూ.67,999 కే కొనుగోలు చేయవచ్చు. పిక్సల్‌ 10 ప్రో హ్యాండ్‌సెట్ ధర రూ.94,999, అదే పిక్సల్‌ 10 ప్రో XL స్మార్ట్‌ఫోన్‌ రూ.109999 కే సొంతం చేసుకోవచ్చు.

గమనిక : ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ధరలు ఇలా ఉన్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ధరలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. యూజర్లు గమనించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Google Pixel smartphone massive discounts on flipkart big billion days 2025 sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X