గూగుల్ పిక్సల్ వాచ్ 4 సేల్ ప్రారంభం.. ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
Google Pixel Watch 4 Sale in india : గూగుల్ పిక్సల్ వాచ్ 4 ఈ సంవత్సరం ఆగస్టులో నెలలో భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ సేల్ ప్రారంభం అయింది. అనేక దేశాల్లో ఈ స్మార్ట్‌వాచ్ అక్టోబర్ నెలలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్‌తోపాటు ఇతర ఉత్పత్తులను కూడా గూగుల్ లాంచ్ చేసింది. ఆయా ఉత్పత్తుల సేల్ కూడా ప్రారంభం అయింది. పిక్సల్ వాచ్ 4 స్మార్ట్‌వాచ్ ధర, సేల్, ఫీచర్ల పూర్తి వివరాలు.
గూగుల్ పిక్సల్ 4 స్మా్ర్ట్‌వాచ్ 41mm వైఫై వేరియంట్ ధర రూ.39,900 గా ఉంది. అదే 45mm వేరియంట్ రూ.43,900 గా ఉంది. ప్రస్తుతం గూగుల్ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లలో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సల్ 4 స్మార్ట్‌వాచ్ 41mm వేరియంట్ ఐరిస్ యాక్టివ్ బ్యాండ్ లేదా పార్సిలియన్ యాక్టివ్ బ్యాండ్ సిల్వర్ అల్యూమినియం కేస్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మరిన్ని వేరియంట్స్‌లోనూ లభిస్తుంది. అదే 45mm మోడల్ మూన్‌స్టోన్ యాక్టివ్ బ్యాండ్ తో కూడిన మూన్‌స్టోన్ అల్యూమినియం కేస్ ను కలిగి ఉంది.
అడ్వాన్సడ్ టెక్నాలజీ :
ఈ పిక్సల్ 4 స్మా్ర్ట్‌వాచ్ అడ్వాన్సడ్ టెక్నాలజీ కూడిన 3D కర్వడ్ అమోలెడ్ (Always On Display) డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. DCI P3 Color gamut సపోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కస్టమ్ 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
పిక్సల్ వాచ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ W5 జెన్ 2 ప్రాసెసర్, Cortex M55 కో ప్రాసెసర్ ను కలిగి ఉంది. Wear OS 6.0 పైన పనిచేస్తోంది. 2GB ర్యామ్, 32GB eMMC స్టోరేజీని సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా గూగుల్ పిక్సల్ 4 స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, NFC, LTE (ఆప్షనల్) సపోర్టును కలిగి ఉంది.
బ్యాటరీ వివరాలు :
పిక్సల్ 4 స్మార్ట్‌వాచ్ 41mm వేరియంట్ 325mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి Always on Display మోడ్‌లో 30 గంటల బ్యాటరీ లైఫ్, అదే బ్యాటరీ సేవర్ మోడ్‌లో 2 రోజుల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. కేవలం 25 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని గూగుల్ చెబుతోంది.
ఈ వాచ్ 45mm మోడల్ 455mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆల్‌వేజ్ ఆన్ డిస్‌ప్లే మోడ్‌లో 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అదే బ్యాటరీ సేవర్ మోడ్‌లో మూడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. USB-C ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు.
ఈ వాచ్ ఆక్సిజన్ శాచురేషన్ మానిటరింగ్, ECG వంటి ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సర్, గైరోస్కోప్, యాక్సిలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications







