టీవీ ప్లాట్‌ఫామ్‌లో ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌ను విడుదల చేయనున్న Google

|

గూగుల్ కొన్ని వారాల క్రితం తమ మొబైల్ ల కోసం ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వెర్షన్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పిక్సెల్ వినియోగదారులకు అందరికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తన కొత్త ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌ను తమ యొక్క సరికొత్త టీవీలకు కూడా తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ క్రొత్త ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్ లలో మెరుగైన ప్రైవసీ ఫీచర్లను మరియు వాటి యొక్క పనితీరును మెరుగుపరిచే విధంగా యాప్ ను రూపొందించడానికి సహాయ డెవలపర్‌లను పొందుతుందని గూగుల్ తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్ 11 వన్‌టైమ్ పర్మిషన్ యాక్సెస్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 11 వన్‌టైమ్ పర్మిషన్ యాక్సెస్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 11 టీవీ వెర్షన్‌కు వన్‌టైమ్ పర్మిషన్ యాక్సెస్ కూడా లభించనున్నది. ఇది అన్ని రకాల యాప్ లను త్వరగా ఓపెన్ చేయడానికి అనుమతిస్తుంది. ఇందులోని ఇంటర్ఫేస్ మార్పులు మొబైల్ వెర్షన్ మాదిరిగానే వినియోగదారులు యాక్సిస్ చేయడానికి సులభతరంగా ఉంటాయి. టీవీ-సెంట్రిక్ మార్పులలో ఆటో లేటెన్సీ మోడ్ మరియు లెస్ లేటెన్సీ మీడియా డీకోడింగ్ మద్దతును కూడా కలిగి ఉంటుంది. వీటితో పాటు మీరు కొత్తగా ట్యూనర్ ఫ్రేమ్‌వర్క్‌ను అదనంగా పొందుతారు.

Also Read:ముకేశ్ అంబానీ మరో సంచలనం...? రూ.4000 ల కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్..?Also Read:ముకేశ్ అంబానీ మరో సంచలనం...? రూ.4000 ల కే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్..?

గూగుల్ ఆండ్రాయిడ్ 11 స్టేడియా గేమింగ్ ఫీచర్

గూగుల్ ఆండ్రాయిడ్ 11 స్టేడియా గేమింగ్ ఫీచర్

ఆండ్రాయిడ్ 11 ప్లాట్‌ఫామ్ విస్తరించిన గూగుల్ స్టేడియా గేమింగ్ కంట్రోలర్‌లతో రన్ అవుతువుంది అని గూగుల్ నిర్ధారించింది. భవిష్యత్తులో గూగుల్ తన స్టేడియా లభ్యతను మరింత విస్తరించడానికి ఇది కీలకంగా ఉంటుంది. వీటితో పాటు లాంగ్-ఫీల్డ్ మైక్రోఫోన్లతో అన్ని రకాల డివైస్ల ఏకీకరణకు ఆండ్రాయిడ్ 11 మద్దతును ఇస్తుంది. ఇది ప్రధానంగా స్మార్ట్ స్పీకర్ పర్యావరణ వ్యవస్థను మరింత మెరుగ్గా అందిస్తుంది.

గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్ విడుదల

గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్ విడుదల

గూగుల్ యొక్క కొత్త ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్ రాబోయే నెలల్లో తన టీవీ OEM ఛానెళ్ల ద్వారా విడుదల కానుందని ఇప్పటికే గూగుల్ ధృవీకరించింది. ఆండ్రాయిడ్ 11 క్రొత్త సంస్కరణకు మద్దతును ఇచ్చే మోడళ్ల గురించి ఇంకా ఖచ్చితమైన వివరాలు తెలియదు. అయితే  షియోమి, VU, రియల్‌మి మరియు సోనీ వంటి వారు తమ ప్రస్తుత స్మార్ట్ టీవీ సిరీస్ లలో విస్తృతంగా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ యొక్క మొబైల్ మరియు టీవీ వెర్షన్‌పై చాలా సంవత్సరాలుగా గూగుల్ దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఈ సంవత్సరం మొబైల్ కోసం ఆండ్రాయిడ్ 11 కు సమానమైన లాంచ్ టైమ్‌లైన్ ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ టివి యొక్క భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google Plan to Release Android 11 Features on TV Platforms

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X