పిల్లల కోసం యూట్యూబ్‌లోకి YouTube Kid యాప్

By Gizbot Bureau
|

గూగుల్ వీడియో ఫ్లాట్ ఫాం యూట్యూబ్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడుతుంటారు. ఇదే నేపథ్యంలో వారికి కొన్ని ఇబ్బంది కలిగించే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కిడ్స్ కోసం ప్రత్యేకంగా websiteని లాంచ్ చేస్తోంది. కాగా 2016లోనే గూగుల్ యూట్యూబ్ చిన్న పిల్లల కోసం కొత్త యాప్‌‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న యూట్యూబ్‌లో అసభ్య వీడియోలు ఉన్నాయని పలువులు అభ్యంతారాలను వ్యక్తం చేశారు. దీంతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను ఏర్పాటు చేయాలని యూట్యూబ్ అప్పుడు నిర్ణయించింది.

పిల్లల కోసం యూట్యూబ్‌లోకి  YouTube Kid యాప్

 

separate website

2016లో చిన్న పిల్లల కోసం kid-centric versionని గూగుల్ విడుదల చేసింది. YouTube Kids పేరుతో ఇండియలో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ఫ్యామిలీతో పాటు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని గూగుల్ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్సన్ ని విడుదల చేసింది. ఇప్పుడు వారికోసం ప్రత్యేకంగా ఓ separate websiteని తీసుకువస్తోంది

అయితే ఇది సపరేట్ బ్లాగర్ లా కాకుండా యూట్యూబ్ ఫోరంలోనే support pageగా ఉండనుంది. ఈ వారంలోనే దీన్ని విడుదల చేస్తామని , దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అందిస్తామని గూగుల్ తెలిపింది.

ఈ యాప్ ద్వారా చిన్న పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం లభించనుంది. పిల్లల తల్లిదండ్రులే దీనిని నియంత్రణ చేయగలిగేలా ఉంటుంది. ఇందులో మూడు రకాల కేటగిరీలు ఉంటాయి. preschool, younger and older ఇలా వయసును బట్టి సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ద్వారా పిల్లలకు రైట్ కంటెంట్ సెలక్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. చిన్న పిల్లలకు కావాల్సిన కంటెంట్, పాటలు, కార్టూన్స్, గేమింగ్, ఫ్యామిలీ రిలేటెడ్, సైన్స్ ఇంకా ఇతర రకాల అంశాలను వయసు వారీగా సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో యూట్యూబ్ పిల్లలకు భద్రమైన చానల్‌ను ఏర్పాటు చేయడం ఎంత కష్టమో.. అది చిన్నారుల కోసం ప్రారంభించిన 'యూట్యూబ్ కిడ్స్'లోకి ఆందోళన రేకెత్తించే వీడియోలు వచ్చిచేరినపుడు అర్థమైంది. అలాగే ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేసినా వాటిని బద్దలుకొట్టేందుకు కొద్దిమంది ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఈ సారి వస్తున్న ఫీచర్ ఎలా ఉంటుందో చూడాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google plans another step to make YouTube 'safer' for kids here's how

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X