1000 శాటిలైట్లతో గూగుల్ ఇంటర్నెట్

ఇంటర్నెట్ కనెక్టువిటీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఫేస్‌బుక్ ఇప్పటికే తన Express WiFiను భారత్‌లో పరీక్షిస్తోంది. ఈ ఎక్స్‌ప్రెస్ వై-ఫై అనేది పబ్లిక్ వై-ఫై హాట్‌స్సాట్స్ ద్వారా వేగవంతమైన ఇంకా క్వాలిటీ ఇంటర్నెట్‌ను ప్రజలకు అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఫేస్‌బుక్ బాటలోనే గూగుల్ కూడా ఇలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Project Loonలో భాగంగా

భారత్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఇప్పటికే ఉచిత ఇంటర్నెట్ సేవలను అందిస్తోన్న గూగుల్ తన Project Loonలో భాగంగా శాటిలైట్ల సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ను అందించేందుకు సిద్ధమవుతోంది.

ని న్యూజీల్యాండ్, కాలిఫోర్నియా, బ్రెజిల్ ప్రాంతాల్లో..

గూగుల్ తన ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని న్యూజీల్యాండ్, కాలిఫోర్నియా, బ్రెజిల్ ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించినట్లు సమాచారం. ‘ప్రాజెక్ట్ లూన్' పేరుతో గూగుల్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్దపెద్ద ఫ్లోటింగ్ బెలూన్లను భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేలా చేసి వాటికి అనుసంధానించే శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ సిగ్నళ్లను పంపిస్తారు.

 

బెలూన్‌లకు నిరంతరం శక్తిని సమకూర్చేందుకు..

బెలూన్‌లకు నిరంతరం శక్తిని సమకూర్చేందుకు సోలార్ ప్యానళ్లతో పాటు అ విండ్ పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌ను గూగుల్ అనుసంధానించనుంది. గూగుల్ ప్రాజెక్ట్ లూన్ పూర్థిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే చవక ధరకే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు.జ

 

గూగుల్.. ఓ పెటెంట్‌‌ను కూడా

ఈ సాంకేతికతకు సంబంధించిన హక్కుల గురించి గూగుల్ ఓ పెటెంట్‌‌ను కూడా ఫైల్ (US 20170005719) చేసినట్లు తెలుస్తోంది. 1000 శాటిలైట్లతో ఈ నెట్‌వర్క్ పనిచేయనుందట. గూగుల్ కొద్ది సంవత్సరాల క్రితమే ‘ప్రాజెక్ట్ లూన్' ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టంది.

బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి

ఇంటర్నెట్ యాంటెన్నాలను అమర్చిన బెలూన్‌లను ఆకాశంలోకి పంపించి వాటిద్వారా భూమ్మీద ఉన్న మారుమూల ప్రాంతాలకు సైతం అంతర్జాలం సేవలను అందుబాటులోకి తీసుకురావటమే ప్రాజెక్ట్ లూన్ ముఖ్య ఉద్దేశ్యం.

బీఎస్ఎన్ఎల్‌లో కలిసి...

ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీని భారత్‌లో పరీక్షించేందుకు బీఎస్ఎన్ఎల్‌లో కలిసి గూగుల్ పనిచేయనున్నట్లు సమాచారం. ఇందుకు గాను 2.6గిగాహెర్ట్జ్ బ్యాండ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను గూగుల్ వినియోగించుకోనున్నట్లు సమాచారం. ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే టవర్ల సహాయం లేకుండా 4జీ ఇంటర్నెట్ మొబైల్ యూజర్లకు చేరువచేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Plans To Cover Our Earth With 1000 Satellites For The Internet. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot