గూగుల్ నెక్సస్ ప్రైమ్ ఫీచర్స్

Posted By: Staff

గూగుల్ నెక్సస్ ప్రైమ్ ఫీచర్స్

టెక్నాలజీ గెయింట్ ప్రపంచానికి మొబైల్ వరల్డ్‌లో ఓ సరిక్రొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని పరిచయం చేసింది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఆండ్రాయిడ్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్ రంగంలో ఎక్కువ ఉపయోగిస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు. గూగుల్ విడుదల చేసినటువంటి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని క్యాష్ చేసుకునేందుకు గూగుల్ శ్యామ్‌సంగ్ మొబైల్ కంపెనీతో కలసి శ్యామ్‌సంగ్ నెక్సస్ సిరిస్‌లో స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి రంగం సిద్దం చేసింది.

శ్యామ్‌సంగ్ మొబైల్ కంపెనీ విడుదల చేసినటువంటి నెక్సస్ సిరిస్ బాగా క్లిక్ అయ్యిన విషయం అందరికి తెలిసిందే. గూగుల్ కోసం ప్రత్యేకంగా శ్యామ్‌సంగ్ నెక్సెస్ సిరిస్ ఓ సరిక్రొత్త మోడల్‌ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇంటర్నెట్ ప్రస్తుతం వస్తున్నటువంటి రూమర్ ప్రకారం గూగుల్, శ్యామ్‌సంగ్ రెండు కలపి ఓ మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నారని చాలా టెక్నాలజీ బ్లాగ్స్ ఈ విషయాన్ని ధృవీకరించాయి. గూగుల్ విడుదల చేయనున్నటువంటి ఆ కొత్త మోడల్ పేరు 'గూగుల్ నెక్సస్ ప్రైమ్' అని తెలిసింది.

కొంత మంది ముఖ్య వ్యక్తులను దృష్టిలోపెట్టుకోని గూగుల్ ఈ నెక్సస్ ప్రైమ్‌ని తయారు చేయడం జరిగిందని తెలిసింది. ఇక గూగుల్ నెక్సస్ ప్రైమ్ 2012 మధ్యలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా. గూగుల్ నెక్సస్ విషయానికి వస్తే 1.2 GHz or a 1.5 GHz superfast ప్రాసెసర్‌నితో రన్ అవుతూ, 1 GB RAM కలిగి ఉంటుందని టెక్నాలజిస్టులు వెల్లడించారు. నెక్సస్ ప్రైమ్ AMOLED కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిప్లే కలిగి ఉండి, హై డెఫినేషన్ కంటెంట్ ప్లేబ్యాక్‌కి సపోర్ట్‌ చేస్తుంది.

అంతేకాకుండా ఈ మొబైల్‌లో మల్టీమీడియా విషయానికి వస్తే వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్, ఎఫ్‌ఎమ్ రేడియో, యూనివర్సిల్ ఆడియో జాక్‌లతో పాటు, ప్రస్తుంత మార్కెట్లో ఉన్న అన్నిరకాలైన వీడియా, ఆడియో ఫార్మెట్లను కూడా సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్లో రెండు కెమెరాలు ఉన్నాయి. ముందు భాగాన ఉన్న కెమెరాతో వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక కనెక్టివిటి విషయానికి వస్తే కొత్త ఫీచర్స్ అయినటువంటి 3జి, బ్లూటూత్, వీడియో కాలింగ్, వై-పై లాంటి అన్నింటిని సపోర్టు చేస్తుంది.

The notable specs of the Nexus Prime:

Android 4.0 Ice Cream Sandwich OS
3G, Bluetooth and Wi-Fi
AMOLED screen
8 Mega Pixel rear camera Java support

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting