హైదరాబాద్‌లో గూగుల్ సొంత క్యాంపస్
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ హైదరాబాద్‌లో తన సొంత క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు వెంచర్‌కు సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో గూగుల్ అవగాహన ఒప్పందం కుదర్చుకునే అవకాశముందని ఆ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చినట్లయితే యూఎస్, యూకేల తరువాత హైదరాబాదే గూగుల్‌కు మూడవ సొంత క్యాంపస్ అవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ క్యాంపస్‌ను ప్రస్తుతం గూగుల్ అద్దె భవనంలో నిర్వహిస్తోందని, త్వరలోనే సొంతం భవనంలోకి మర్చాలని చూస్తోందని సింగ్ తెలిపారు. ఈ వెంచర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించేందుకు త్వరలోను ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దే క్రమంలో చేపట్టబోయే ప్రాజెక్టుకు సంబంధించి సీస్కో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌తో పాటు తైవాన్‌కు చెందిన ఓ కంపెనీ ఆసక్తి కనబరిచాయని సింగ్ వెల్లడించారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








