డిజైన్ లో మార్పులు చేయనున్న గూగుల్ !

Posted By: Madhavi Lagishetty

గూగుల్...యూజర్లకు లెటెస్ట్ అప్ డేట్స్ ను అందించడంలో ముందుంటుంది. త్వరలో వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి డిజైన్లో మార్పులు చేయనుంది. టచ్ స్క్రీన్ పై అవగాహన కల్పించడం ద్వారా వినియోగదారులకు గోప్యత మరియు భద్రతా డాష్ బోర్డుకు ఒక సాధారణ విధానాన్ని అందిస్తుంది.

డిజైన్ లో మార్పులు చేయనున్న గూగుల్ !

గూగుల్ మ్యాప్స్ యూట్యూబ్ మరియు సెర్చ్ లతో సహా ప్రతి గూగుల్ ప్రొడక్ట్ లో స్టోరేజ్ చేయబడుతున్న సమాచారం గురించి వినియోగదారులకు తెలియజేసే అంశాలను కూడా గూగుల్ పరిచయం చేస్తుంది.

ఈమధ్యే గూగుల్ ఒక బ్లాగ్ పోస్టును ప్రచురించింది. 2009లో ప్రారంభించిన యూజర్ డాష్ బోర్డ్ ను పూర్తిని రీడిజైన్ చేయబడుతుందని బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ఈ డాష్ బోర్డ్ యూజర్లు వారి గూగుల్ అకౌంట్ మరియు కార్యకలాపాలు, పలు గూగుల్ టూల్స్, పోడక్టులతో అనుబంధించబడిన వివరాలను సవరిచడానికి అనుమతించే సాధనాలను కలిగి ఉంటుంది.

డిజైన్ లో మార్పులు చేయనున్న గూగుల్ !

ఇది విభిన్న రీతిలో గూగుల్ సాధనాలు మరియు ప్రొడక్టులపై అన్ని కార్యచరణలను చూడటానికి అనుమతిస్తుంది. దీన్ని ఉపయోగించి గూగుల్ ప్రొడక్ట్ ను బట్టి సెర్చ్ హిస్టరీని తొలగించి... కార్యాచరణలను నిర్వహించడానికి అనుమతిస్తుంది.

మై అకౌంట్..మై యాక్టివిటీ వంటి కొత్త సాధనాలను నిర్మించిప్పుడు, డాష్ బోర్డును ఇతర సీక్రెట్స్ నియంత్రణల్లో మరింత సమగ్రంగా ఉంచుకోవాలని స్పష్టమైంది. డేటా గురించి అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎల్లప్పుడూ ఈజీగా ఉంటాలి. అందుకే దీనిని రీడిజైన్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.

ప్రవేశపెట్టిన మార్పులు గురించి కూడా బ్లాగ్ లో తెలిపింది. టచ్ స్క్రీన్లలో వినియోగం మెరుగుపరచడమనేది అత్యంత ముఖ్యమైన మార్పు. డాష్ బోర్డ్ ఏ పరికరంలోనైనా బాగా వర్క్ చేస్తుందని నిర్థారించుకోండి. మీరు ఉపయోగించే గూగుల్ ప్రొడక్టుల గురించి ఈజీగా చూడటం మరియు వాటిలో ప్రతి మీ డేటాను ఈజీగా డౌన్ లోడ్ చేసుకునేలా చేశాము.

ఈ ఏడు ఫీచర్లు లేని ఆండ్రాయిడ్ ఫోన్ కొనకండి !

సెక్యూరిటీ మరియు ప్రైవసీ డాష్ బోర్డ్ తరచుగా సగటు వినియోగదారులు ఉపయోగించడంలేదు. అయినప్పటికీ గూగుల్ దృశ్యమానతను మార్చడానికి మరియు వినియోగదారులకు మరింత సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది.

Read more about:
English summary
Google has announced that it plans to redesign its security and privacy dashboard to make it more accessible to users.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot