గూగుల్ కీలక నిర్ణయం.. స్పామ్ Emails ఇబ్బందులకు చెక్.. ఏప్రిల్ నుంచే అమల్లోకి..!
గూగుల్ జీమెయిల్ ( Gmail Latest Updates ) ప్రస్తుతం కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగం నుంచి అనేక అవసరాల కోసం జీమెయిల్ తప్పనిసరి. అయితే జీమెయిల్ వినియోగదారుల్లో చాలా మంది స్పామ్ మెయిల్స్‌తో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యకు సంస్థ చెక్‌పెట్టనుంది.
బల్క్ ఈమెయిల్ పంపే వారిపై గూగుల్ పరిమితులు విధించనుంది. ఫలితంగా స్పామ్ మెయిల్‌లపై (Gmail Spam News) నియంత్రణ ఉండనుంది. బల్క్ మెయిల్‌లు పంపేవారు గూగుల్ తాజా కొత్త పాలసీ కట్టుబడి ఉండాలని పేర్కొంది. లేకుంటే వారి ఈమెయిల్‌లో తిరస్కరించ బడతాయని తెలిపింది. దీంతోపాటు ఇటువంటి ఈమెయిల్‌లు కావాలని ఆప్షన్ ఇచ్చిన వారికి మాత్రమే పంపాలని తెలిపింది.

గత సంవత్సరం అక్టోబర్‌లో తమ బ్లాగ్ ద్వారా గూగుల్ బల్క్ ఈమెయిల్‌లపై పరిమితులను ప్రకటించింది. అవాంచిత ఈమెయిల్‌లను నిలువరించేందుకు అవస్థలు పడాల్సిన అవసరం లేదని పేర్కొంది. వాణిజ్య ఈమెయిల్‌లను అన్ సబ్‌స్క్రైబ్ చేయాలని భావిస్తున్నవారికి ఒక్క క్లిక్ ద్వారా బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నాం. దాంతోపాటు అన్ సబ్‌స్క్రిప్షన్ రిక్వస్ట్‌లను రెండు రోజుల్లోనే పరిష్కరించాలని కోరుతున్నామని పేర్కొంది.
గూగుల్ జీమెయిల్ కొత్త విధానం వినియోగదారులుకు మేలు చేయనుంది. రోజుకు 5000 ఈమెయిల్ పంపే ( బల్క్ సెండర్లు ) సంఖ్యను పరిమితం చేయనున్నారు. ఈ సంఖ్యను భారీగా తగ్గించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. అయితే గూగుల్ అప్‌డేటెడ్ నిబంధనల ప్రకారం బల్స్ ఈమెయిల్ పంపేవారు వారి అవుట్ గోయింగ్ ఈమెయిల్‌లను ధ్రువీకరించవలసి ఉంటుంది.
సింగిల్ క్లిక్ అన్‌సబ్‌స్రైబ్ ఆప్షన్ : జీమెయిల్ తాజా నిబంధనల ప్రకారం బల్స్ ఈమెయిల్‌లు పంపేవారు జూన్ 2024 నాటికి అన్ని బిజినెస్ మరియు ప్రమోషనల్ ఇమెయిల్‌ల కోసం సింగిల్ క్లిక్ అన్‌సబ్‌స్రైబ్ ఆప్షన్‌ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో పాటు కంటెంట్‌లో ఈ బటన్‌ను సులభంగా గుర్తించేలా ఉండాలని పేర్కొంది. ఈ అన్‌సబ్‌స్రైబ్ అభ్యర్థనలను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని తెలిపింది.
రూల్స్ పాటించకుంటే ముందు తాత్కాలిక ఇబ్బందులు : బల్క్ ఈమెయిల్‌లు పంపే సంస్థలు గూగుల్ నిబంధనలను అందుకోవడంలో విఫలం అయితే తాత్కాలిక అవస్థలు ఎదుర్కొంటారని పేర్కొంది. ఈ తప్పులు నానా కంప్లైంట్ ట్రాఫిక్‌లో కొంత భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయని పేర్కొంది.
ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే.. : ఏప్రిల్ 2024 ప్రారంభం అయ్యే ఇమెయిల్ ట్రాఫిక్ కొంత భాగాన్ని తిరస్కరించడం ప్రారంభిస్తామని గూగుల్ తెలిపింది. అనంతరం క్రమంగా పెద్ద మొత్తంలో ఇలాంటి ఇమెయిల్‌లను తిరస్కరిస్తామని పేర్కొంది. గూగుల్ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇమెయిల్‌లను తిరస్కరిస్తామని పేర్కొంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








