నావిగేషన్ బార్‌లో 'గూగుల్ ప్లే'

Posted By: Staff

నావిగేషన్ బార్‌లో 'గూగుల్ ప్లే'

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఇటీవలే ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్‌ని గూగుల్ ప్లస్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు సరిక్రొత్తగా 'గూగుల్ ప్లే' యూజర్స్‌ని ఆకర్షించేందుకు గాను గూగుల్ ఇండెక్స్ బార్(జీమెయిల్, ఆర్కూట్, మ్యాప్స్, ఇమేజెస్, క్యాలెండర్)లాంటివి కనిపించే వాటి సరసన గూగుల్ ప్లే బార్‌ని కూడా చేర్చింది. గూగుల్ హోం పేజిని ఓపెన్ చెయ్యగానే.. గూగుల్ ప్లే బటన్‌ త్రిభుకార ఆకారం మాదిరి మీకు దర్శమనిస్తుంది.

గూగుల్ ఈనెల మొదట్లో ఆండ్రాయిడ్ మార్కెట్‌ని గూగుల్ ప్లేగా నామకరణం చేసింది. ఆండ్రాయిడ్‌కు సంబంధించిన అప్లికేషన్స్, మ్యూజిక్, వీడియోస్, ఈబుక్స్ మొదలగునవి అన్ని వినియోగదారులకు ఒకే చోట లభ్యమయ్యే విధంగా ఒక ప్లాట్ ఫామ్‌ని రూపొందించింది. ఈ ప్లాట్ ఫామ్ పేరే గూగుల్ ప్లే. ఐతే అన్ని దేశాలకు గూగుల్ ప్లే ఒకే విధంగా ఉండదు. ఆస్టేలియా గూగుల్ ప్లే స్టోర్‌లో అప్లికేషన్స్‌తో పాటు బుక్స్ లభ్యమవుతుండగా.. జపాన్ స్టోర్లో అప్లికేషన్స్‌తో పాటు సినిమాలు లభ్యమవుతున్నాయి.

గూగుల్ ఎక్స్ పీరియన్స్‌ని పొందే వినియోగదారులకు రాబోయే కాలంలో గూగుల్ ప్లే గొప్ప అనుభూతిని అందించనుంది. గూగుల్.కామ్‌లో ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న గూగుల్ ప్లే స్టోర్ రాబోయే కాలంలో క్రోమ్ యూజర్స్‌ని కూడా ఆకట్టుకోనుందని సమాచారం. మీరు గనుక నావిగేషన్ బార్‌ని గమనించినట్లేతే గూగుల్ ఎంటర్టెన్మెంట్‌కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot