రికార్డ్: 25 బిలియన్‌ల డౌన్‌లోడ్‌లను క్రాస్ చేసిన గూగుల్ ప్లే

Posted By: Prashanth

రికార్డ్: 25 బిలియన్‌ల డౌన్‌లోడ్‌లను క్రాస్ చేసిన గూగుల్ ప్లే

 

గూగుల్ అప్లికేషన్ స్టోర్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఆండ్రాయిడ్ బ్లాగ్ వెలువరించిన సమాచారం మేరకు ఈ అప్లికేషన్ స్టోర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకున్న వారిక సంఖ్య 25 బిలియన్‌ల మార్క్‌ను క్రాస్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్‌ల సంఖ్య 675,000. ఈ రికార్డులను అధిగమించటంలో ఆపిల్ అప్లికేషన్ స్టోర్‌తో పోలిస్తే గూగుల్ ప్లే స్టోర్ కాస్త వెనకబడి ఉందని చెప్పొచ్చు. ఆపిల్ అప్లికేషన్ స్టోర్ గడిచిన మార్చిలోనే ఈ రికార్డును నమోదు చేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని గూగుల్ ప్లే వివిధ అప్లికేషన్‌ల పై ఐదు రోజుల పాటు వివిధ రాయితీలను ప్రవేశపెట్టింది.

హిందూ క్యాలెండర్ మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో..

ఏ మొబైల్‌లో అయినా క్యాలెండర్ అప్లికేషన్ సర్వసాధారణంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వార తేదీ, సంవత్సరం, రిమైండర్ వంటి అంశాలను తెలసుకోవచ్చు. ఇటీవల రూపుదిద్దుకున్న ఓ ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ మన దేశపు సంస్కృతి సాంప్రదాయాలను అద్దపట్టేదిగా ఉంది. ఈ ‘హిందూ క్యాలెండర్’ టూల్‌లో రాశి, తిథి, నక్షత్రం, పండుగలు, శుభమహూర్తాలు, రాహుకాలాలు లాంటి పంచాగ వివరాలను నిక్షిప్తం చేసారు. ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఈ టూల్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ లింక్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot