గూగుల్ ప్లే మ్యూజిక్ కనడపడటం లేదు, ఎందుకో తెలుసా ?

By Gizbot Bureau
|

టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటిదాకా మ్యూజిక్ ప్రియులను ఎంతో అలరిస్తున్న గూగుల్ ప్లే మ్యూజిక్ ను మెల్లిగా బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. గతేడాది ఇండియాలో లాంచ్ చేసిన యూట్యూబ్ మ్యూజిక్ ఇప్పుడు సరికొత్త హంగులతో ముందుకు రావడంతో గూగుల్ ప్లే తెర వెనక్కి వెళ్లిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. గూగుల్ కూడా గూగుల్ ప్లే మ్యూజిక్ కంటే యూట్యూబ్ మ్యూజిక్ మీదే గట్టి ఫోకస్ పెడుతోంది. రానున్న గూగుల్ ఫోన్లలో ఇకపై గూగుల్ ప్లే మ్యూజిక్ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 9, 10 ఓఎస్ ఉన్న ఫోన్లలో
 

ఆండ్రాయిడ్ 9, 10 ఓఎస్ ఉన్న ఫోన్లలో

రానున్న ఆండ్రాయిడ్ 9, 10 ఓఎస్ ఉన్న ఫోన్లలో గూగుల్ ప్లే మ్యూజిక్‌కు బదులుగా యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను అందివ్వనున్నట్లు గూగుల్ తెలిపింది. అయితే గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది.

యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌

యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌

ఆ ఫోన్ వాడే యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ ద్వారా పాటలు వినాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు విసుగు కలిగించే అంశం కూడా ఉంది. పాటల మధ్యలో యాడ్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ యాప్‌కుగాను నెలకు రూ.99 చెల్లించాలి. అదే ఫ్యామిలీ ప్లాన్ అయితే రూ.149 చెల్లిస్తే 5 మంది ఉపయోగించుకోవచ్చు. దీంతో యాడ్స్ రాకుండా పాటలను బ్యాక్ గ్రౌండ్‌లోనూ వినవచ్చు.

పిక్సల్ ఫోన్లకు అవుట్

పిక్సల్ ఫోన్లకు అవుట్

ఇప్పటికే కొంతమందికి గూగుల్ ప్లే స్టోర్ లో గూగుల్ మ్యూజిక్ కనపడటం లేదని కంప్లయింట్లు ఇస్తున్నారు. పిక్సల్ 2, 3 ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లలో గూగుల్ ప్లే మ్యూజిక్ కనపడటం లేదని, లింక్ డౌన్లోడ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందని చెబుతున్నారు.

పూర్తిగా కనుమరుగవుతుందా ?
 

పూర్తిగా కనుమరుగవుతుందా ?

రానున్న కాలంలో గూగుల్ ప్లే మ్యూజిక్ పూర్తిగా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. గూగుల్ ప్లే కన్నా యూట్యూబ్ ద్వారానే గూగుల్ కు ఆదాయం వస్తుందని, ఇందులో భాగంగానే గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ ని బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Play Music not showing up in the Play Store for some people

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X