మెగా అభిమానులకు షాక్!

Posted By: Prashanth

మెగా అభిమానులకు షాక్!

 

గుగూల్ I/O ప్రదర్శనకు మరో వారం రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఆండ్రాయిడ్ అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకుంది. ఈ ప్రదర్శనలో భాగంగా గుగూల్, ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 4.1’ను ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్, గూగూల్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ నెక్సస్’పై మెగా అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అమెరికాలో ఈ ఫోన్‌లను విక్రియించనున్న గుగూల్ ప్లే స్టోర్ ఓ ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. విడుదలకానున్న ‘గెలాక్సీ నెక్సస్’ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పై రన్ కానుందన్న ఉత్తేజకర వార్తను ఇక్కడి వర్గాలు బహిర్గతం చేశాయి.

దేశీయ వినియోగదారులకు చేదు వార్త!

‘గెలాక్సీ నెక్సస్’ కోసం ఎదురుచూస్తున్న భారతీయ వినియోగదారులకు సామ్‌సంగ్ వర్గాలు షాకిచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ విపణిలో విడుదల చెయ్యటంలేదంటూ అధికారికంగా ప్రకటించంటంతో మార్కెట్ వర్గాల్లో ఆయోమయ పరిస్థితి నెలకుంది. సామ్‌సంగ్ చేసిన ఈ ప్రకటనకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot