గూగుల్ ప్లే స్టోర్‌లోకి పేమెంట్ మెథడ్‌ ఆప్సన్

By Gizbot Bureau
|

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇండియాలోని యూజర్ల కోసం కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ప్లే స్టోర్‌లో కొత్తగా యూపీఐ పేమెంట్ మెథడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే వారాల్లో ఈ యూపీఐ పేమెంట్ మెథడ్‌ యాప్ ద్వారా యాప్స్ కొనుగోలు, గేమ్స్, in-app content వంటి వాటికి నేరుగా పేమెంట్ చెల్లించవచ్చు. యూజర్లు ప్లే స్టోర్‌లో ఆయా యాప్స్‌కు జరిపే కొనుగోళ్లకు గాను యూపీఐ విధానంలో BHIM, Google Pay, Paytm, and PhonePe వంటి వాటి ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. అయితే ముందుగా పేమెంట్ మెథడ్స్‌లో వినియోగదారులు తమ యూపీఐ ఐడీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ పేమెంట్ విధానంతో వారు యాప్‌లకు చెల్లింపులు జరపవచ్చు. ఈ ఆప్సన్ లో మీరు డెబిట్ కార్డు లేక క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఎయిర్టెల్ బిల్లింగ్ వంటి వాటి ద్వారా మెంట్ మెథడ్‌ ఆప్సన్ ఎంచుకోవచ్చు.

 

వెయ్యికోట్లకుపైబడిన లావాదేవీలు

వెయ్యికోట్లకుపైబడిన లావాదేవీలు

ఇదిలా ఉంటే యునిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యుపిఐ)లావాదేవీలు రానురాను పుంజుకుంటున్నాయి. ఇప్పటివరకూ యుపిఐ వెయ్యికోట్లకుపైబడిన లావాదేవీలు నిర్వహించింది.యుపిఐ ప్లాట్‌ఫామ్‌కింద సుమారు 17.29 లక్షలకోట్లమేర మూడేళ్లపాటు లావాదేవీలునిర్వహించింది. అంటే ప్రారంభంనుంచి కూడా ఈ డిజిటల్‌ లావాదేవీలకు మంచి ప్రోత్సాహం లభించింది. మూడేళ్లలోనే యుపిఐ ప్లాట్‌ఫామ్‌ సరికొత్త మైలురాయిని నమోదుచేసింది. 

37 నెలల్లో 17.29 లక్షలకోట్లు 

37 నెలల్లో 17.29 లక్షలకోట్లు 

2016లో ప్రారంభించిన తర్వాత భారత జాతీయ చెల్లింపులసంస్థ (ఎన్‌పిసిఐ) 2019 ఆగస్టు వరకూ 1,029.44 కోట్ల లావాదేవీఉల నిర్వహించింది. కేవలం మొబైల్‌ ద్వారా మాత్రమే చెల్లింపులజరిపే ఈ వ్యవస్థకు మొత్తం 37 నెలల్లో 17.29 లక్షల కోట్లు లావాదేవీలునిర్వహించినట్లు వెల్లడించింది. మొత్తం లావాదేవీలసంఖ్య 819.03 కోట్లు కాగా ఈ లావాదేవీలద్వారా 14.11 లక్షలకోట్లు లావాదేవీలుజరిగాయి. సెప్టెంబరు 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యకాలంలోనే ఈ లావాదేవీలు 81.60శాతం వాటాతో ఉన్నాయి.

2016 డిసెంబరులోనే 19 లక్షల లావాదేవీలు
 

2016 డిసెంబరులోనే 19 లక్షల లావాదేవీలు

పెద్దనోట్ల రద్దు తర్వాతరోజుల్లో కూడా యుపిఐ డిజిటల్‌ చెల్లింపులకు పెద్దపీటవేసింది. 2016 డిసెంబరులోనే 19 లక్షల లావాదేవీలుజరిగాయి. నెలవారీ లావాదేవీల మూడు లక్షలలోపు ఉన్నవే ఎక్కువ జరిగాయి. భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (భీమ్‌) యాప్‌ను ఎన్‌పిసిఐ ప్రారంభించిన తర్వాత మరింతగా చెల్లింపుల్లో వృద్ధి కనిపించింది.

భీమ్‌ యాప్‌ద్వారా తగ్గిన చెల్లింపులు

భీమ్‌ యాప్‌ద్వారా తగ్గిన చెల్లింపులు

భీమ్‌ యాప్‌ ద్వారా మొత్తం లావాదేవీలు యుపిఐ ప్లాట్‌ఫామ్‌పై 41.36శాతంగా ఉన్నాయి. జనవరి 2017నుంచి చూస్తే ఆగస్టు 2019 నాటికి 1.82శాతంపెరిగాయి. భీమ్‌ యాప్‌ద్వారా చెల్లింపులు జనవరిలో కొంత తగ్గాయి. ప్రారంభంలోయుపిఐ పి2పి చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌గా పనిచేసింది. టెక్నాలజీ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లోనికి రావడంతో వ్యక్తులనుంచి వ్యాపారులవరకూ పి2ఎం విభాగానికి కూడా యుపిఐ విస్తరించింది.

Best Mobiles in India

English summary
Google Play Store Officially Gets UPI as a Payment Option

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X