Home
News

షాకిస్తున్న గూగుల్ ప్లే స్టోర్, అప్‌డేట్ రావడం లేదు

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన ప్లే స్టోర్ సేవలకు ప్రపంచంలోని పలు దేశాల్లో అంతరాయం కలుగుతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలో ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయడం కుదరడం లేదని చెబుతున్నారు. మరికొందరు తమ ఫోన్లలో ఉన్న యాప్‌లను ప్లే స్టోర్ ద్వారా అప్‌డేట్ చేయడం కుదరడం లేదని, అలాగే కొత్త యాప్‌ల డౌన్‌లోడ్‌కు కూడా వీలు కావడం లేదని చెబుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

షాకిస్తున్న గూగుల్ ప్లే స్టోర్, అప్‌డేట్ రావడం లేదు

అయితే ఈ విషయంపై గూగుల్ ఇంకా స్పందించలేదు. కాగా కేవలం మొబైల్ వెర్షన్ ప్లే స్టోర్ మాత్రమే సరిగ్గా పనిచేయడం లేదని, వెబ్ వెర్షన్ ప్లే స్టోర్ పనిచేస్తుందని తెలిసింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ సర్వీసులకు తీవ్రమైన అంతరాయం కలుగుతున్నదని యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. అమెరికా సహా, పలు యూరోపిన్, ఏషియన్ దేశాల ఆండ్రాయిడ్ యూజర్లకు ప్లే స్టోర్ సర్వీస్‌లు అందడం లేదని తెలుస్తున్నది.

కనెక్టివిటీ ఇష్యూ

కనెక్టివిటీ ఇష్యూ

online outage monitoring website DownDetector ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ ఇష్యూ మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెలువడుతున్నాయి. ఈ వెబ్ సైట్ ఇప్పటిదాకా దాదాపు 1,500 reports ని అందుకుందని రిపోర్ట్ చేసింది.అయితే గూగుల్ మాత్రం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ

ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ

యూజర్లు ఏ అంశమైనా ట్విట్టర్ ద్వారా తమ ఆవేశాన్ని వెళ్లగక్కుతున్న సంగతి అందరికీ తెలిపిందే. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ మీద కూడా ట్విట్టర్లో సెటైర్లు మీద సైటైర్లు వేస్తూ ఆడేసుకుంటున్నారు. హువాయి మొబైల్స్ కే కాకుండా ప్రతి మొబైల్ కి గూగుల్ అప్ డేట్స్ రావడం లేదని చెబుతున్నారు.

క్రోమ్‌లో మరిన్ని మార్పులు

క్రోమ్‌లో మరిన్ని మార్పులు

ఇదిలా ఉంటే యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ కీత్‌ ఎన్‌రైట్‌ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం' అని వివరించారు. క్రోమ్‌లో మరిన్ని మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.

వినియోగదారులకు క్షమాపణలు

వినియోగదారులకు క్షమాపణలు

కాగా గూగుల్‌ డుయో తన వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సందేశాన్ని పొరపాటున ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు పంపించింది. ఇది అనుకోకుండా జరగడంతో తన వినియోగదారులను క్షమాపణలు కోరింది. కాగా గూగుల్‌ డుయో ఇండియాకు కోహ్లీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

కోహ్లీ సందేశం

కోహ్లీ సందేశం

‘మీ అభినందనలకు కృతజ్ఞతలు. డుయోలో టీమిండియాకు ఇలాగే విషెస్‌ చెబుతూ ఉండండి' అంటూ కోహ్లీ చెబుతున్న వీడియో సందేశాన్ని పొరపాటున భారీ సంఖ్యలో వినియోగదారులకు చేరిపోయింది. తప్పు తెలుసుకున్న వెంటనే గూగుల్‌ దీనిపై క్షమాపణలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. అది అనుకోకుండా జరిగిందని వివరణ ఇచ్చింది. ‘ఇది ప్రకటన కాదు.. త్వరలో భారత్‌లో చేపట్టబోయే డుయో ప్రచారంలో పాల్గొనే వారికి పంపించాల్సిన సందేశం' అని కంపెనీ పేర్కొంది.

రెడిట్‌లో ఫిర్యాదు

రెడిట్‌లో ఫిర్యాదు

ఈ వీడియో సందేశంపై రెడిట్‌లో పలువురు ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఆసక్తికరమైన విషయం ఎంటంటే.. అమెరికా, కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని యూజర్లకు ఈ వీడియో షేర్‌ చేయగా.. భారత్‌లో మాత్రం షేర్‌ చేయకపోవడం గమనార్హం.

Best Mobiles in India

English summary
Google Play Store Down: Android Users Getting 'Server Error' While Accessing the Store
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X