'ఢీ అంటే ఢీ' ఆపిల్ ఐట్యూన్స్ వర్సెస్ గూగుల్ ప్లే

Posted By: Prashanth

'ఢీ అంటే ఢీ' ఆపిల్ ఐట్యూన్స్ వర్సెస్ గూగుల్ ప్లే

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్‌ని ఇటీవలే కొత్తగా గూగుల్ ప్లస్ అంటూ నామకరణం చేసిన విషయం తెలిసిందే. హాఠాత్తుగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆండ్రాయిడ్ మార్కెట్ నుండి గూగుల్ ప్లస్‌గా పేరు మార్చి ప్రస్తుతం మార్కెట్లో డిజిటల్ మీడియా రంగంలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఐట్యాన్స్‌కి గట్టి పోటీనివ్వడానికేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా ఆపిల్, గూగుల్ మద్య పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకేనని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారులు ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్స్‌ని ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల ఆండ్రాయిడ్ వినియోగదారులకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నింటిని కూడా గూగుల్ ప్లేలో డౌన్ లౌడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఐట్యూన్స్ విషయానికి వస్తే సినిమాలు, మ్యూజిక్, అప్లికేషన్స్, ఆడియో బుక్స్ లాంటి వాటన్నింటికి సంబంధించిన సమాచారం ఆపిల్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

దీనిని ఫాలో అయి సెర్చ్ ఇంజన్ గెయింట్ కూడా సరిగ్గా ఇదే కాన్సెప్ట్తోటి గూగుల్ ప్లే ని యూజర్స్ వద్దకు చేరవేర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఐట్యూన్స్ మాదిరే గూగుల్ ప్లే ఇంటర్ ఫేస్ కూడా వినియోగదారులకు అర్దమయ్యే విధంగా తయారు చేశారు. గూగుల్ ప్లే లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి ఆప్లికేషన్స్, ఈబుక్స్, సినిమాలు(అద్దెకు) యూట్యూబ్ ద్వారా లేదా గూగుల్ ప్లే మూవీస్ అప్లికేషన్ ద్వారా వీక్షించే వెసులుబాటు కల్పించారు. లండన్ వెబ్ సైట్‌లో ప్రస్తుతానికి మ్యూజిక్ అందుబాటులో లేదు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot