ఆల్ఫాబెట్ ఇంక్‌ సరికొత్త నిర్ణయం,పర్యావరణంలో పెను మార్పులు

By Gizbot Bureau
|

దిగ్గజ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ సంస్థకు చెందిన ఆల్ఫాబెట్ ఇంక్‌ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2022 నాటికి తమ ప్రతి ఉత్పత్తిలో పునరుత్పాదక (రీసైకిల్డ్‌) ప్లాస్టిక్‌ను వినియోగించనున్నామని ప్రతిజ్ఞ చేసింది. వచ్చే ఏడాది నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తామని ఆల్ఫాబెట్ ఇంక్‌ ప్రకటించింది. గూగుల్‌ కొత్తగా తీసుకొన్న ఈ నిర్ణయంతో పర్యావరణంలో కార్బన్‌ ఉద్గారాల విడుదలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామంటూ ఇది వరకే ప్రతిజ్ఞ చేసిన టెక్ కంపెనీల జాబితాలో చేరింది.

Google pledges carbon-neutral shipping

ఇదిలా ఉంటే ప్యారిస్ పర్యావరణ సదస్సులో వ్యవసాయరంగంలో ఉద్గారాలు తగ్గిస్తామని 119 దేశాలు ప్రమాణం చేశాయి. అయితే ఎలా చేస్తామనే విషయం మాత్రం అవి చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్‌ ప్రతిజ్ఞతో పర్యావరణంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. గూగుల్‌ నుంచి ఉత్పత్తి అయ్యే మొబైల్‌ ఫోన్లు, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌లను తరలించడానికి విమానాలకు బదులు ఓడలపై ఎక్కువ ఆధారపడటంతో తమ కంపెనీ రవాణాకు సంబంధించిన కార్బన్ ఉద్గారాలు 2017తో పోలిస్తే గత ఏడాది 40 శాతం పడిపోయాయని గూగుల్ పరికరాలు, సేవల విభాగాధిపతి 'అన్నా మీగన్’ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గూగుల్ కంపెనీ హార్డ్‌వేర్ వ్యాపారంలో అడుగుపెట్టి కేవలం 3 సంవత్సరాలే అయినప్పటికి, తమ ప్రత్యర్థి ఆపిల్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోందని మీగన్ వెల్లడించారు.

Google pledges carbon-neutral shipping

తమ సంస్థ ఆన్‌లైన్‌లో విక్రయించే గూగుల్ హోమ్ స్పీకర్లు, యూఎస్‌బీ, పెన్‌డ్రైవ్‌లు ప్రతి తొమ్మిది గూగుల్ ఉత్పత్తులలో మూడింటికి ప్లాస్టిక్‌ను 20 శాతం నుంచి 42శాతం వరకు తిరిగి వినియోగించవచ్చనే అంశాన్ని గూగుల్‌ వర్గాలు పరిశీలిస్తున్నాయి. అంతేకాక ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ 2022 నాటికి 100 శాతం రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది.ఇదిలా ఉంటే దేశంలోనే రెండో క్లీన్‌ సిటీగా పేరు తెచ్చుకున్న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌ తాజాగా మరో ఆదర్శ నిర్ణయం తీసుకుంది. 'గార్బేజ్‌ కేఫ్‌’ పేరిట ప్లాస్టిక్‌ చెత్త తీసుకుని బదులుగా భోజనం పెట్టేందుకు సిద్ధమైంది. ఛత్తీస్‌గఢ్‌ సర్గుజాలోని అంబికాపుర్‌ పురపాలక సంస్థ... దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్‌ వ్యర్థాలనే బిల్లుగా తీసుకుని భోజనం పెట్టేందుకు 'గార్బేజ్‌ కేఫ్‌’ను ఏర్పాటు చేయనుంది. చెత్త సేకరించి జీవనం సాగించేవారు, వీధి బాలలు ఎందరో ఈ కేఫ్‌కు వచ్చి కాస్త చెత్త ఇచ్చి పొట్ట నింపుకోవచ్చు.

Google pledges carbon-neutral shipping

'పురపాలక సంస్థ బడ్జెట్‌లో గార్బేజ్‌ కేఫ్‌ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాం. పేదవారికి ఉచిత భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మేము స్వచ్ఛతతో జోడించాం. ఎవరైనా రోడ్లపై పడేసి ఉన్న కిలో ప్లాస్టిక్‌ను తీసుకువస్తే వారికి ఉచితంగా అన్నం పెడతాం. అరకిలో ప్లాస్టిక్‌ తెస్తే ఉచిత అల్పాహారం పెడతాం. ఈ విధంగా మేము స్వచ్ఛతను పెంపొందిస్తూ, పేదలకు సాయం చేస్తున్నాం అని అంబికాపుర్‌ మేయర్‌ తెలిపారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా గార్బేజ్‌ కేఫ్‌ పథకం అమలవబోతోంది. ఇప్పటికే కేంద్ర స్వచ్ఛ్‌ సర్వేక్షన్‌-2019 ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఇందోర్‌ ఉండగా రెండో స్థానంలో అంబికాపుర్‌ ఉంది.

Best Mobiles in India

English summary
Google pledges carbon-neutral shipping, recycled plastic for all devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X