గూగుల్ ప్లస్ 'వెరిఫికేషన్ బ్యాడ్జిలు' అందుకున్నారా ..?

Posted By: Super

గూగుల్ ప్లస్ 'వెరిఫికేషన్ బ్యాడ్జిలు' అందుకున్నారా ..?

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్‌కి కొత్తగా 'వెరిఫికేషన్ బ్యాడ్జి' అనే కొత్త ఫీచర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐతే ప్రస్తుతానికి గూగుల్ ప్లస్ వెరిఫికేషన్ బ్యాడ్జిలు పబ్లక్ ఫిగర్స్, సెలబ్రిటీలతో పాటు, గూగుల్ ప్లస్‌లో ఎక్కువ మంది యూజర్స్‌ని సర్కిల్స్ ద్వారా యాడ్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే గూగుల్ ప్లస్‌లో ఉన్న అందరూ యూజర్స్‌కు గూగుల్ ప్లస్ వెరిఫికేషన్ బ్యాడ్జిలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఈ విషయాన్ని గూగుల్ అఫీసియల్ వెన్-ఎఐ యూ తన పోస్ట్ ద్వారా వెల్లడించారు. మొదటగా పబ్లిక్ ఫిగర్స్, సెలబ్రిటీలు ఎవరైతే గూగుల్ ప్లస్‌లో ఉన్నారో వారికి ఇవ్వడంతో పాటు, గూగుల్ ప్లస్ సర్కిల్స్ ద్వారా ఎక్కవ మందిని ప్రెండ్స్‌ని ఎవరైతే యాడ్ చేసుకుంటారో వారికి కూడా ఈ గూగుల్ ప్లస్ బ్యాడ్జిలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎవరైతే గూగుల్ ప్లస్ వెరిఫికేషన్ బ్యాడ్జిలు పోందుతారో వారియొక్క ప్రోపైల్ నేమ్ ప్రక్కన ఈ వెరిఫికేషన్ బ్యాడ్జిని చూడోచ్చు. యూజర్స్ ప్రక్కనే ఉన్న టిక్ మార్క్ పై మౌస్‌ని గనుక ఉంచినట్లైతే 'వెరిఫికేషన్ నేమ్‌'ని చూసిస్తుంది.

గూగుల్ ప్లస్ గతంలో ఎక్కవ మంది సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్స్‌ని ఆకర్షించడం కోసం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ యొక్క అప్లికేషన్‌ని ఇమిడికృతం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ సినిమా స్టార్స్ కోసం ప్రత్యేకంగా గూగుల్ ప్లస్ వెరిఫైడ్ ఎకౌంట్ సిస్టమ్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వెరిఫికేషన్ పెట్టడానికి కారణం యూజర్స్ ఈజీగా దొంగ ఎకౌంట్స్‌ని పసిగట్టి తమ యొక్క ప్రెండ్స్‌కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవచ్చు. ఇటీవలే గూగుల్ ప్లస్‌లో ఉన్న దొంగ ఎకౌంట్లను పూర్తిగా తొలగించడం జరిగిందని గూగుల్ ఆఫీసియల్స్ వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot