ఫేస్‌బుక్‌కి కాంపిటేషన్‌గా గూగుల్ ప్లస్ ప్రాజెక్టు

Posted By: Staff

ఫేస్‌బుక్‌కి కాంపిటేషన్‌గా గూగుల్ ప్లస్ ప్రాజెక్టు

సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్‌‍బుక్ హవాను చూసిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఫేస్‌బుక్‌కి పోటీ సర్వీసుని ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్కుట్ సర్వీస్‌ను గూగుల్ నిర్వహిస్తున్నప్పటికీ, ఫేస్ బుక్‌కు అది ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. అందుకే గూగుల్ ప్లస్ పేరుతో కొత్త వెబ్‌సైట్‌ను లాంఛ్ చేసింది. ఎవరికీ పోటీ కాదని గూగుల్ చెబుతున్నా.. సైట్ ను చూస్తే మాత్రం ఫేస్ బుక్ కు పోటీనే అంటున్నారు కంప్యూటర్ నిపుణులు. పైగా ఫేస్ బుక్ లో లేని సరికొత్త ఫీచర్లనూ ఇందులో పొందుపరిచారు.

గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వెబ్‌సైట్‌లో ఎంతమందితోనైనా వీడియో ఛాట్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రాజెక్ట్ తో సోషల్ నెట్ వర్కింగ్ లోనూ అగ్రస్థానాన్ని అందుకోవాలనే ఉద్దేశ్యంతోనే గూగుల్ దీనిని ప్రారంభించిందని అంటున్నారు. ప్రస్తుతానికి అందరికీ దీన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు. సైట్ టెస్టింగ్ దశలోనే ఉండడంతో, కొంతమందికి మాత్రమే దీన్ని పరిమితం చేసింది. ముందుగా రిజిస్టర్ చేసుకుంటే, గూగుల్ పరిశీలించి సభ్యత్వాన్ని ఇస్తుందన్నమాట. కావాలంటే మీరు కూడా ఓ సారి దాన్ని చూడొచ్చు. సైట్ అడ్రస్ https://plus.google.com/

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot