గూగుల్ ప్లస్ షట్‌డౌన్, డేటాను కాపాడుకోండి
దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గతేడాది డిసెంబర్‌లో తన గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.
దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ గతేడాది డిసెంబర్‌లో తన గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. చెప్పినట్లుగానే గూగుల్ ఇకపై గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేయనుంది. వచ్చే ఏప్రిల్ 2వ తేదీ నుంచి గూగుల్ ప్లస్ ఇక పనిచేయదని ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే యూజర్లకు చెందిన గూగుల్ ప్లస్ అకౌంట్లు, వారు క్రియేట్ చేసిన పేజీలు, అందులో ఉండే కంటెంట్‌ను కూడా గూగుల్ పూర్తిగా డిలీట్ చేయనుంది. కానీ తమ సమాచారం కావాలనుకున్న వారు గూగుల్ ప్లస్‌లో నుంచి ఆ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ అందిస్తున్నది. కాకపోతే ఏప్రిల్ 2వ తేదీ వరకు మాత్రమే అందుకు అవకాశం ఉంటుంది. అయితే గూగుల్ ఫొటోస్‌లో బ్యాకప్ అయి ఉన్న ఫొటోలు, వీడియోలు మాత్రం డిలీట్ అవ్వవని గూగుల్ తెలిపింది.

యూజర్ల డేటా ఇతరుల చేతికి
సాఫ్ట్‌వేర్ పరమైన సాంకేతిక లోపాలతో యూజర్ల డేటా ఇతరుల చేతికి చేరే అవకాశాలుండటమే ఇందుకు కారణమని గూగుల్ తెలిపింది.

5,00,000 మంది యూజర్ల ప్రైవేట్ డేటా
ఒక బగ్ మూలంగా 5,00,000 మంది యూజర్ల ప్రైవేట్ డేటా బయటి డెవలపర్లకు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తగిన ఆధారాలేమీ..
అయితే, ఏ డెవలపర్‌కు కూడా ఈ బగ్ గురించి గానీ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ) దుర్వినియోగం గురించి గానీ తెలుసనడానికి తగిన ఆధారాలేమీ కనిపించలేదని గూగుల్ తెలిపింది.

ప్రొఫైల్ డేటా
అలాగే ఎవరి ప్రొఫైల్ డేటా కూడా దుర్వినియోగం అయిన దాఖలాలు కూడా కనిపించలేదని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజినీరింగ్ విభాగం) బెన్ స్మిత్... ఒక బ్లాగ్‌లో పేర్కొన్నారు.బగ్‌ను సరిదిద్దేందుకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా అంతర్గతంగా నిర్వహించిన పరిశీలనలో ఈ అంశాలు వెల్లడైనట్లు ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications