రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తున్న గూగుల్‌ ప్లస్‌

Posted By: Super

రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తున్న గూగుల్‌ ప్లస్‌

సెర్చ్ ఇంజన్ గూగుల్ గెయింట్ జూన్ నెలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్‌ ప్లస్‌ 40 మిలియన్ల వినియోగదారులను దాటిపోయింది. ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమైన గూగుల్‌ ప్లస్‌లో నాలుగు నెలలు గడవకముందే 4 కోట్ల మందిని ఆకర్షించడం పట్ల గూగుల్‌ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి సెప్టెంబర్‌ 20నే గూగుల్‌ ప్లస్‌ ప్రజల్లోకి వచ్చిందని, అంతకుముందు కేవలం బీటా వర్సన్ భాగంగా నిర్వహించామని గూగుల్‌ వెల్లడించింది. గూగుల్ ప్లస్‌కి పోటీగా ఉన్న మరో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ మూడేళ్ళలో 25 మిలియన్ల మార్కును దాటిందని, 2004లో స్థాపించిన ఫేస్‌బుక్‌ అక్టోబర్‌ 2007 నాటికి 50 మిలియన్ల మార్కును అధిగమించిందని, అయితే తాము కొద్ది రోజుల్లోనే 40 మిలియన్ల ఖాతాదారులను సంపాదించామని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ లార్రి పేజ్‌ వివరించారు.

కాగా ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 26 శాతం వృద్ధితో 2.73 బిలియన్‌ డాలర్ల నికర ఆదాయాన్ని ఆర్జించామని గూగుల్‌ ప్రకటించడం జరిగింది. మరోవైపు ప్రముఖ సోషల్‌ వెబ్‌సైట్‌ యాహూను కొనుగోలు చేసేందుకు గూగుల్‌ ప్రయత్నిస్తోందని, ఇందుకు 43 బిలియన్‌ డాలర్ల నగదుతోపాటు మరికొంత మొత్తాన్ని ఇవ్వనుందంటూ వస్తున్న వార్తలను యాహూ సంస్థ కొట్టిపారేసింది. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన వార్తలుగా యాహూ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot