యూసీ బ్రౌజర్ ఏమైంది...కనిపించడంలేదు!

By Madhavi Lagishetty
|

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న మొబైల్ ఇంటర్నెట్ సర్ఫింగ్ అప్లికేషన్ UC బ్రౌజర్ , గూగుల్ ప్లే స్టోర్లో కనిపించడంలేదు. UC బ్రౌజర్ను ఇన్ స్టాల్ చేసుకోవడానికి సెర్చే చేస్తే UC మినీ యాప్ మాత్రమే కనిపిస్తోంది.

 
యూసీ బ్రౌజర్ ఏమైంది...కనిపించడంలేదు!

అలీబాబా సొంతమైన మొబైల్ బ్రౌజర్ ప్లే స్టోర్ నుంచి కనిపించనప్పటికీ...యూసీ బ్రౌజర్ మినీ మరియు యూసీ న్యూస్ తో సహా ఇతర యూసీ వెబ్ అప్లికేషన్లను ఇప్పటికే సెర్చ్ లో కనిపిస్తున్నాయి. యూసీ బ్రౌజర్ గత నెలలో 500మిలియన్ డౌన్ లోడ్లతో మరియు అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రౌజర్లలో ఒకటిగా నిలిచింది. ఇండియాలో 100మిలియన్ల మంది వాడుతున్నారు.

అత్యధిక జనాదరణ పొందినప్పటికీ యూజీ బ్రౌజర్ భారతీయ యూజర్ల పర్సనల్ డేటాను చైనాలో ఒక సర్వర్ కు బదిలీ చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ బ్రౌజర్ను యూజర్ అన్ ఇన్ స్టాల్ చేసినప్పటికీ డేటాను సేకరిస్తుందని రిపోర్టులు తెలిపాయి. ఈ బ్రౌజర్ పై భారత ప్రభుత్వం నిఘా కూడా పెట్టింది.

ఆండ్రాయిడ్ పోలీస్ ఫౌండర్ Artem Russakovskii ఘాటుగా స్పందించారు. తనకు ఓ మెయిల్ వచ్చిందని....అందులో 30రోజులపాటు బ్రౌజర్ను తాత్కాలికంగా ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు ఉందని తెలిపారు. డౌన్లోడ్లు పెంచుకునుందకు యూజర్లను తప్పుదోవ పట్టించింనందుకు హానికరమైన విధానాలను అవలంబించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉందని తెలిపారు.

Honor 7X వచ్చేస్తోంది.. అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లుHonor 7X వచ్చేస్తోంది.. అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లు

మీకో గుడ్ న్యూస్. మీరు ఇప్పటికీ APK ఫైలు ద్వారా యూసీ బ్రౌజర్ సైడ్ లోడ్ చేయవచ్చు. కానీ మీ డివైస్ను పొటెన్షల్ డేంజర్లోకి నెట్టబడుతుంది.

Best Mobiles in India

English summary
While UC Browser has vanished from Google Play Store, other UCWeb applications including UC Browser Mini and UC News are still visible.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X