త్వరలో.. గూగుల్ రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ యాప్

Posted By:

మాటలను టెక్స్ట్ రూపంలో మార్చే అప్‌డేటెడ్ వర్షన్ గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ రంగం సిద్ధం చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ ట్రాన్స్‌లేట్ యాప్‌లో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ రికగ్నిషన్ ఫీచర్ ప్రముఖ భాషల్లో మీరు మాట్లాడే మాటలను టెక్స్ట్ రూపంలో మార్చేస్తుందని వెర్జ్ తెలిపింది. ఈ కొత్త పరిజ్ఞానాన్ని గూగుల్ 2013 నుంచి అభివృద్థి చేస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

త్వరలో.. గూగుల్ రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ యాప్

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి...?

ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి.

‘From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి ‘To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.

English summary
Google To Release Real Time Translation App. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting