గూగుల్ క్రోమ్12ని విడుదల చేసిన గూగుల్, డౌన్‌లోడ్ చేసుకోండి

Posted By: Super

గూగుల్ క్రోమ్12ని విడుదల చేసిన గూగుల్, డౌన్‌లోడ్ చేసుకోండి

కాలిఫోర్నియా: వెబ్ సెర్చ్ ఇంజన్ గూగుల్ వెబ్ బ్రౌజర్ అయినటువంటి గూగుల్ క్రోమ్ 12 బ్రౌజర్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ని గూగుల్ వెల్లడించిది. కొత్తగా విడుదల చేసినటువంటి గూగుల్ క్రోమ్ 12 బ్రౌజర్‌ కొత్త ఫీచర్స్, సెక్యూరిటీ ఆఫ్షన్‌లతో అలరించనుందని తెలిపారు. గూగుల్ క్రోమ్ 12లో మనం అందరం గుర్తుపెట్టుకోదగ్గ ఫీచర్ సేఫ్ బ్రౌజింగ్ ఆఫ్షన్. మనం ఎప్పుడైనా ఏమైనా స్క్రీన్స్ గానీ, ఫైల్సు గానీ డౌన్ లోడ్ చేసుకుంటున్నప్పుడు మన సిస్టమ్‌కు హానీ కలిగించేటటువంటి వైరస్ లాంటి వాటినుండి రక్షణ కల్పిస్తుంది ఈ సేఫ్ బ్రౌజింగ్ ఆఫ్షన్.

ఈ సందర్బంలో గూగుల్ క్రోమ్ డెవలపర్స్ మాట్లాడుతూ గూగుల్ క్రోమ్‌లో క్రొత్తగా రూపోందించినటువంటి సేఫ్ బ్రౌజింగ్ ఆఫ్షన్‌‌ని చాలా జాగ్రత్తగా రూపోందించడం జరిగిందన్నారు. మీకు కావాల్సిన ఫైల్స్‌కి సంబంధించిన URLs‌ని మీరు చూసిన లేక డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో మీ సిస్టమ్‌కు హాని కలిగించే వైరస్ ఉంటే వెంటనే గూగుల్ క్రోమ్ సేఫ్ బ్రౌజింగ్ ఆఫ్షన్‌ ద్వారా పసిగట్టేస్తుంది. ఇది మాత్రమే కాకుండా గూగుల్ క్రోమ్ 12 యూజర్ కంప్యూటర్‌లో ఉన్నటువంటి డేటా మీద కంట్రోల్‌ని ఇస్తుంది. కొత్తగా విడుదల చేస్తున్నటువంటి క్రోమ్ 12 3డి సిఎస్‌ఎస్ సపోర్టు చేస్తుంది. దీని అర్దం ఏమిటంటే యూజర్స్ 3డి ఎఫెక్ట్స్ ఉన్నటువంటి కొన్ని వెబ్ పేజీలను చూసినప్పుడు వారికి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది.

Google Chrome 12 new features include:

* Hardware accelerated 3D CSS
* New Safe Browsing protection against downloading malicious files
* Ability to delete Flash cookies from inside Chrome
* Launch Apps by name from the Omnibox
* Integrated Sync into new settings pages
* Improved screen reader support
* New warning when hitting Command-Q on Mac
* Removal of Google Gears

గూగుల్ క్రోమ్ 12 డౌన్‌లోడ్ ప్రస్తుతం విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అందుబాటులో ఉంది. మీరు గనుక కొత్త షో గూగుల్ క్రోమ్ 12ని డౌన్ లోడ్ చేసుకోవాలంటే పైన క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot