భారతీయ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్.. కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..!!
భారత్‌లోని కొన్ని యాప్‌లను తన ప్లేస్టోర్ (Google Playstore) నుంచి తొలగించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఫీజుల చెల్లింపు వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదంపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఈ నిర్ణయాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఏయే యాప్‌లను తొలగించారంటే : భారత్‌కు చెందిన మ్యాట్రిమొని.కాం, భారత్ మ్యాట్రిమొని సహా ఉద్యోగాలకు సంబందించిన సమాచారాన్ని అందించే నౌకరీ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ సంస్థలు తమ యాప్‌లో చెల్లింపు మార్గదర్శకాలను పాటించడం లేదని పేర్కొంది.

తాను ఈ వివాదంపై గూగుల్‌తో మాట్లాడాడని మరియు ఈ స్టార్టప్‌లను త్వరలో కలుస్తానని అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) పేర్కొన్నారు. ఈ రకమైన డీ లిస్టింగ్‌ను తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. భారతీయ స్టార్టప్‌లకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.
తన నిర్ణయాన్ని సమర్ధించుకున్న గూగుల్ : అయితే యాప్‌ల తొలగింపుపై అనేక విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే గూగుల్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఆండ్రాయిడ్, ప్లేస్టోర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు మరియు ప్రమోట్ చేసేందుకు ఈ ఫీజులు సహాయపడతాయని గూగుల్ వెల్లడించింది.

న్యాయపరంగా ముందుకెళ్లిన గూగుల్ : ఇన్ యాప్ పేమెంట్ రుసుము కింద 11 నుంచి 26 శాతం వసూలు చేయకుండా కొన్ని భారతీయ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు వివదానికి కారణం అయ్యాయి. దీనిపై గూగుల్ న్యాయపరంగా ముందుకు వెళ్లింది. సుప్రీం కోర్డు తీర్పులతో ఛార్జీలు వసూలు మరియు యాప్‌ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంది.
గూగుల్ నిర్ణయం కారణంగా ఎవరు ఇబ్బంది పడ్డారంటే? : ఈ ప్లేస్టోర్ నుంచి యాప్‌ల తొలగింపుపై గూగుల్ స్పందించింది. కొన్ని భారతీయ సంస్థలు ఇలాంటి రుసుమును చెల్లించకూడదని నిర్ణయించుకున్నాయని పేర్కొంది. గూగుల్ తాజా నిర్ణయం కారణంగా మ్యాట్రిమొని.కాం ఎక్కువగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
తమ అన్ని యాప్‌లు ప్లే స్టోర్ నుంచి తొలగింపబడ్డాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని మ్యాట్రిమొని.కాం వ్యవస్థాపకుడు జానకిరామన్ తెలిపారు. నౌకరీ యాప్ వ్యవస్థాపకుడు కూడా ఈ పరిస్థితిపై స్పందించారు. కొన్ని యాప్‌లు మరలా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
గతంలో గూగుల్ చర్యలు : గూగుల్ నిబంధనల ఉల్లంఘన కారణంగా 2020లో భారత్‌కు పేమెంట్ యాప్ పేటీఎంను క్లుప్తంగా తొలగించింది. ఈ నిర్ణయంతో సదరు సంస్థ చట్టపరమైన కేసులు దాఖలు చేయడం ద్వారా గూగుల్‌ను ఎదుర్కొన్నారు. మరియు స్టా్ర్టప్ నెట్‌వర్స్‌ను విస్తృతంగా విస్తరించేందుకు అవకాశం లభించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








